Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ సందేశాలు పంపొచ్చు!

ఐఫోన్లలో సోషల్ మీడియా సైట్లను ఉపయోగించాలంటే.. ఇంటర్నెట్ తప్పనిసరి. డెస్క్‌టాప్‌ల కంటే మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా సైట్లైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్‌లను వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అ

ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ సందేశాలు పంపొచ్చు!
, బుధవారం, 25 జనవరి 2017 (18:04 IST)
ఐఫోన్లలో సోషల్ మీడియా సైట్లను ఉపయోగించాలంటే.. ఇంటర్నెట్ తప్పనిసరి. డెస్క్‌టాప్‌ల కంటే మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా సైట్లైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్‌లను వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇకపై వాట్సాప్‌లో సందేశాలు పంపుకోవాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇదేంటి? నిజమా అని ప్రశ్నిస్తున్నారు కదూ.. అవును ఇకపై వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపాలనుకునే ఐఫోన్ వినియోగదారులకు ఇది శుభవార్తే కానుంది.
 
ఇంటర్నెట్ అవసరం లేకుండా తమ సందేశాలను ఐఫోన్ ద్వారా వినియోగదారులు పంపుకోవచ్చునని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200గా ఉన్న ఫోన్లకు అందజేస్తున్నామని, ఐఫోన్లను అప్ డేట్ చేసుకోవడం వలన ఈ ఆఫర్ పొందవచ్చని వాట్సాప్ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఫీచర్‌ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటికే ప్రవేశపెట్టారు. 
 
కొత్తగా యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లకు కూడా వర్తించే విధంగా తీర్చిదిద్దారు. ఐఓఎస్ వెర్షన్ ద్వారా ఒకేసారి 30 ఫోటోలు లేదా వీడియోలు పంపవచ్చునని వాట్సాప్ వెల్లడించింది. ఐఫోన్ స్టోరేజీ తగినట్లుగా  ఐఓఎస్ వెర్షన్ 4.2017.0200 డేటాను భద్రపరుస్తుందని.. అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా... పవన్ వెంట పరుగులు తీయడానికి తిరుపతి విద్యార్థులు రెడీ