ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే క్రియేటర్లు తాము చేసే పోస్టుల ఆధారంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కలిపించనుంది ఇన్‌స్టాగ్రామ్. ట్విట్టర్ తీసుకొచ్చిన సూపర్ ఫాలో ఫీచర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ అనే ఫీచర్‌ను తీసుకొస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి.
అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచి క్రియేటర్ బ్యాడ్జ్ సాధించిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే వీరు పోస్ట్ చేసే స్టోరీలను కూడా అందరూ చూడలేరు. డబ్బులు చెల్లించి మెంబర్ షిప్ తీసుకున్న వారు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పించారు. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించినా తర్వాత డబ్బులు వసూలు చేస్తారు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక క్రియేటర్స్ పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను స్క్రీన్ షాట్‌లను తీసుకునే అవకాశం ఉండదు.