Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినియోగదారులకు మద్దతుగా వాట్సాప్ హయర్ సేవలు.. ఎలాగంటే?

వినియోగదారులకు మద్దతుగా వాట్సాప్ హయర్ సేవలు.. ఎలాగంటే?
, మంగళవారం, 16 మార్చి 2021 (22:30 IST)
Haier
గృహోపయోగ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో గ్లోబల్ లీడర్ ప్రముఖ ఉపకరణాల్లో వరుసగా 12 ఏళ్ల నుంచి నెం.1 బ్రాండ్‌గా ఉన్న హయర్, నేడు తన నూతన వినియోగదారుల కోసం సేవా కార్యక్రమాన్ని ప్రారంభించగా, అది వాట్సప్ మరియు మెసెంజర్లలో అందుబాటులో ఉంది. ఈ సేవల ద్వారా హయర్ వినియోగదారుల సమీక్షను వాట్సప్ ద్వారా నిర్వహించే లక్ష్యాన్ని కలిగి ఉండగా సేవా అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
 
2020లో హయర్ వాట్సప్ ఛానెల్‌ను పరిచయం చేయగా, అది నేడు తన వినియోగదారులకు సమస్యలను పరిష్కరించేందుకు, నూతన సర్వీసు రిక్వెస్టులు పెట్టుకునేందుకు మరియు ప్రస్తుత స్థితిగతుల గురించి విచారణ చేసేందుకు మద్దతు ఇస్తుంది. ఈ ఛానెల్‌ను చాట్‌బోట్లు, లైవ్ ఏజెంట్ల ద్వారా అందుబాటులోకి రాగా, వినియోగదారులకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుంది. దీన్ని ఒక అడుగు తీసుకెళ్లేందుకు హయర్ ఈ రంగంలో మొదటి వాట్సప్ ఛానెల్‌ను ప్రారంభించగా, ఇది రియల్- టైమ్ ఆధారంలో అందించే సేవల గురించి సమాచారాన్ని సేకరించడమే కాకుండా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
 
వినియోగదారులు ఈ సేవలకు వేగవంతమైన సందేశాన్ని పంపించడం ద్వారా హయర్‌ వాట్సప్ నంబరు +91 8553049999 సంఖ్యకు రీడైరెక్ట్ చేసే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రిజిస్ట్రరు చేసుకోవచ్చు. వారు వాట్సప్‌ను అన్ని హయర్ తయారు చేసే అన్ని విభాగాల అప్లయన్సెస్, వినియోగదారుల సేవలకు ప్రమాణీకరించేందుకు నిపుణులు అలాగే ఇంజినీర్ల గురించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు వినియోగించుకోవచ్చు. 
 
అంతే కాకుండా, హయర్ వినియోగదారుల కమ్యూనికేషన్ ఇంకా అనుభవ క్షేత్రంలో వాట్సప్ ద్వారా మరింత ఆవిష్కరణలు మరియు పరిశోధన కొనసాగించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. తన వినియోగదారులకు ఈ వర్గంలోని అత్యుత్తమ సేవా ఆఫర్లను అందించే లక్ష్యంతో కంపెనీకి నూతన ప్రత్యేకతలను తీసుకు రానుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరొక మహిళతో భర్త షాపింగ్.. భార్యకు అడ్డంగా దొరకడంతో..?