Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ - యాపిల్ ప్లే స్టోర్లలో 8 లక్షల యాప్‌లపై నిషేధం

Advertiesment
Google Play Store
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:41 IST)
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. ఏదో విధంగా ప్లే స్టోర్లలో కొత్త యాప్‌లను చొప్పిస్తున్నారు. ఈ ఫేక్ యాప్‌లతో మొబైల్ యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
 
'హెచ్‌1 2021 డీలిస్టెడ్‌ మొబైల్ యాప్స్‌ రిపోర్ట్‌' పేరుతో పిక్సలేట్‌ ఒక నివేదిక రూపొందించింది. ఇందులో మోసపూరితమైన, హానికరమైన 8,13,000 యాప్‌ల జాబితాను పొందుపరిచింది. ఈ యాప్‌లు కెమెరా, జీపీఎస్‌ వంటి వాటి ద్వారా యూజర్ డేటా సేకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటిలో 86 శాతం యాప్‌లు 12 ఏళ్లలోపు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పేర్కొంది. 
 
ఈ యాప్‌ల తొలగింపునకు ప్రధాన కారణం యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌ భద్రతాపరమైన నిబంధనలను ఉల్లంఘిండమేనని పిక్సలేట్ తెలిపింది. నిషేధిత జాబితాను రూపొందించే ముందు ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లలో సుమారు 5 మిలియన్ యాప్‌లను విశ్లేషించినట్లు పిక్సలేట్ తెలిపింది. 
 
నివేదికలో పేర్కొన్న యాప్‌లకు సుమారు 21 మిలియన్‌ యూజర్‌ రివ్యూలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం నిషేధిత యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ తెలిపింది. 
 
యాపిల్‌ యాప్‌స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌లను నిషేధించినప్పటికీ ఈ యాప్‌లు యూజర్ల ఫోన్లలో ఉండొచ్చని పిక్సలేట్ అభిప్రాయపడింది. యూజర్స్ వెంటనే వాటిని తమ ఫోన్లలోంచి డిలీట్ చేయాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు