హైదరాబాద్ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జేఎన్టీయు) పరిధిలో బీటెక్, బీఫార్మసీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల ముందుగానే అందించాల్సి ఉన్నా పలు కాలేజీల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పరీక్షా సమయం దగ్గరపడినా హాల్‌టికెట్లు జారీచేయకపోతే పరీక్ష కేంద్రాల గురించి ఎలా తెలుసుకోవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ చంద్రమోహన్‌ను హాల్‌టికెట్ల పంపిణీపై వివరణ కోరగా ఇప్పటికే అన్ని కళాశాలలకు వాటిని పంపించినట్లు తెలిపారు.