అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ మరో ముందగుడు వేసింది. ఇందులోభాగంగా నకిలీ ఖాతాలపై ఫేస్‌బుక్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే 540 కోట్ల ఫేక్ ఖాతాలను ఫేస్‌బుక్ నిలిపివేసింది.
నిఘా వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇందుకోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది.
నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఈ ఏడాది రద్దు చేసినట్లు తెలిపింది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను పసిగట్టే పద్ధతులను మెరుగుపర్చుకున్నట్లు 'పారదర్శకత నివేదిక'లో ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.