ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వుంటుంది. ప్రస్తుతం మరో కొత్త అప్ డేట్ ఇచ్చింది. అదేంటంటే... ఫేస్ బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని యూజర్లతో పాటు తమ ఖాతాలు బ్లాక్ అయితే వాటిని తిరిగి పొందేందుకు లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్ ప్రవేశపెట్టింది.
ఈ సౌకర్యంతో యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందే అవకాశం వుంటుంది. గతంలో ఒకసారి లాక్ అయితే తిరిగి పొందటం చాలా కష్టం. ఇపుడు ఈ సమస్య లేకుండా చేస్తుంది.
మరోవైపు ఫేస్ బుక్ పేజీల్లో కొంతమంది అభ్యంతరకర పోస్టులు, అసభ్య పదజాలాన్ని జోడించండం కూడా ఎక్కువైంది. అలాంటి వాటిని కట్టడి చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.