Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్.... తెలియని విషయాలు.... ఏంటవి?

ఫేస్‌బుక్ నేటి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని అప్లికేషన్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వినియోగదారులు కలిగిన అతి తక్కువ అప్లికేషన్‌లలో ఇది ఒకటి. పెద్దగా చదువుకోని వ్యక్తులు కూడా ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్ గురించి మనలో చాలామందిక

ఫేస్‌బుక్.... తెలియని విషయాలు.... ఏంటవి?
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (16:52 IST)
ఫేస్‌బుక్ నేటి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని అప్లికేషన్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వినియోగదారులు కలిగిన అతి తక్కువ అప్లికేషన్‌లలో ఇది ఒకటి. పెద్దగా చదువుకోని వ్యక్తులు కూడా ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్ గురించి మనలో చాలామందికి తెలియని చాలా విషయాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఫేస్‌బుక్‌కు దాదాపు 300 పెటా బైట్‌ల వినియోగదారు డేటాను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. సాధారణంగా 10 లక్షల గిగా బైట్‌లు ఒక పెటా బైట్‌గా పిలవబడుతుంది. ఒక పెటా బైట్‌కు 2000 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ప్లే చేయగల పాటలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
 
భారతదేశంలో ఒక్కో ఫేస్‌బుక్ అకౌంట్‌పై దాని యాజమాన్యం సగటున 16 డాలర్లు సంపాదిస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంపాదన అమెరికా, యూరప్ ఖండాలలో సగటున 50 నుండి 100 డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది.
 
ఫేస్‌బుక్ లోగో నీలి మరియు తెలుపు రంగులో ఉంటుంది. దీనికి కారణం దీని వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఎరుపు, పచ్చ రంగులు కనిపించకపోవడమే.
 
ఫేస్‌బుక్‌లో రాత్రి 10 నుండి 11 గంటల మధ్య చేసే పోస్ట్‌లకు రోజులోని ఇతర సమయాల్లో చేసే పోస్ట్‌ల కంటే 88% ఎక్కువ ప్రతిస్పందనలు వస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
 
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ హ్యాకింగ్ బారిన పడకుండా తన వెబ్ కెమెరాకు ఒక స్టిక్కర్‌ను అతికించి ఉంటారు. ఈ స్టిక్కర్‌ను అమెరికన్ డిజిటల్ హక్కుల సమూహం ఇఎఫ్ఎఫ్ విక్రయిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో తాను ఓ జాత్యహంకార బాధితుడుని : మిజోరాం ముఖ్యమంత్రి