Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌కు జుకర్‌బర్గ్ సారీ... 'డేటా లీక్‌ స్కాంకు నాదే పూర్తి బాధ్యత'

అమెరికా కాంగ్రెస్‌కు జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. డేటా లీక్‌ కుంభకోణానికి వ్యక్తిగతంగా ఆయన సారీ చెప్పారు. ముందు ప్రకటించినట్లుగానే మంగళవారం అమెరికా కాంగ్రెస్‌ ఎదుట హాజరయ్యారు.

కాంగ్రెస్‌కు జుకర్‌బర్గ్ సారీ... 'డేటా లీక్‌ స్కాంకు నాదే పూర్తి బాధ్యత'
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (12:03 IST)
అమెరికా కాంగ్రెస్‌కు జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. డేటా లీక్‌ కుంభకోణానికి వ్యక్తిగతంగా ఆయన సారీ చెప్పారు. ముందు ప్రకటించినట్లుగానే మంగళవారం అమెరికా కాంగ్రెస్‌ ఎదుట హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా 'ఒక పత్రిక మీ సంస్థలో డేటా చౌర్యం గురించి చెప్పేదాకా మీకు ఆ విషయమే తెలియదంటే మీ రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. మీరు చెప్పేది నిజమా? కాదా? అన్నది నిర్థరించాలి. ఉద్దేశపూర్వకంగా డేటా లీక్‌ జరిగి ఉంటే దానికి ఎవరు, ఏ స్థాయి వ్యక్తులు బాధ్యత వహిస్తారు? ఈ కుంభకోణం అనంతరం ఉన్నతస్థాయిలోని ఒక్క వ్యక్తి మీద కూడా మీరు చర్య తీసుకున్నట్లు లేదే.. ఎందుకని?' అని కాంగ్రెస్‌ విచారణ కమిటీ నిలదీసింది. 
 
దీనికి జుకర్‌బర్గ్ సమాధానమిస్తూ, ఫేస్‌బుక్‌ను తానే ప్రారంభించానని, తానే నిర్వహణ బాధ్యతలు చూస్తున్నానని చెప్పారు. డెవలప్ చేసిన టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తప్పుడు వార్తలకు సమాచారం వాడకుండా అడ్డుకోవడంలో తాము విఫలమైనట్టు చెప్పారు. 
 
కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ యాప్‌ డెవలపర్‌ నుంచి సమాచారం పొందిందని, డేటా దుర్వినియోగంపై పూర్తిస్థాయి ఆడిట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. నకిలీ ఫే‌స్‌బుక్ అకౌంట్లను వేల సంఖ్యలో తొలగించామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు జుకర్‌బర్గ్ సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడిపందేల్లో పాల్గొన్న ప్ర‌జా ప్ర‌తినిధులు : హైకోర్టుకు డీజీపీ నివేదిక‌