ఈఎస్డిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ఈరోజు, కంపెనీ యొక్క 20వ వార్షిక దినోత్సవ మెగా వేడుక సందర్భంగా సావరిన్-గ్రేడ్ జిపియూను ఒక సర్వీస్‌గా తన సర్వీస్ పోర్ట్‌ఫోలియో విస్తరణలలో ఒకదానిని ప్రకటించింది. ఈ వేడుక సూల వైన్యార్డ్స్, నాశిక్ వద్ద, శ్రీ. పీయూష్ ప్రకాశ్ చంద్ర సోమాని- ఈఎస్డిఎస్ యొక్క ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఇతర గౌరవనీయ అతిథుల సమక్షములో నిర్వహించబడింది. ప్రముఖ సంస్థలు, పరిశోధన సంస్థలు, బిఎఫ్ఎస్ఐ మరియు ప్రభుత్వ రంగాలలో AI/ML, జెన్AI మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) పనిభారాల విశేష వృద్ధికి తోడ్పడుటకు ఈ విస్తరణ రూపొందించబడింది.
ప్రస్తుతము ప్రపంచస్థాయిలో అధిక-పనితీరు AI కంప్యూట్ అందించే ఒక సావరిన్-గ్రేడ్ మేనేజ్డ్ జిపియూ ప్రొవైడర్‌గా తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈఎస్డిఎస్ను ఈ ముఖ్యమైన ప్రారంభము సంపూర్ణ క్లౌడ్ స్పెక్ట్రం, నిర్వహించబడే సేవలు, డేటా సెంటర్ మౌలికసదుపాయాలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా నిలబెట్టింది. జిపియూలు-యాక్సిలరేటర్స్‌తో కలిపి AI- ఆప్టిమైజ్ చేయబడిన సర్వర్లపై ప్రపంచ వ్యయం 2026లో US $329.5 బిలియన్లు తాకుతుందని అంచనావేయబడింది. నిర్ణయాత్మకమైన, హై-త్రూపుట్ కంప్యూట్ వాతావరణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఈఎస్డిఎస్ ప్రస్తుతం సంస్థలు, బిఎఫ్ఎస్ఐ, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు మిషన్-క్రిటికల్ AI పనిభారాలను నిరంతర పనితీరు, సురక్షితమైన కార్యకలాపాలు మరియు తక్కువ-లాటెన్సీ డిస్ట్రిబ్యూటెడ్ శిక్షణల కోసం ఒక ఉద్దేశంతో-నిర్మించబడిన జిపియూ సూపర్‌పాడ్స్ పై నడిపించే వీలు కలిగిస్తుంది. పూర్తిగా నివహించబడిన జిపియూ AIను సరైన ఆర్కిటెక్చరల్ పునాదితో నమ్మకంగా కొలవడములో సహాయపడే సంస్థల మౌలికసదుపాయాల కలయికలో ఈఎస్డిఎస్ తన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంది.
పీయూష్ సోమాని, ఈఎస్డిఎస్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఇలా అన్నారు, ఇది పరిశ్రమలలో భారీ-స్థాయి AI మౌలికసదుపాయాల కొరకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించుటకు ఒక వ్యూహాత్మక చర్య. ప్రపంచ AI విలువ 2030 నాటికి సుమారు US $15.7 ట్రిలియన్లకు చేరుకుంటుందని, ఆ పెట్టుబడిలో 80% జిపియూ వైపుకు మళ్ళించబడుతుందని అంచనావేయబడిన నేపథ్యములో, విశ్వాసయోగ్యమైన, అధిక-పనితీరు జిపియూ ఎకోవ్యవస్థల కొరకు అవసరము కొత్త స్థాయికి చేరుకుంది. చాలాకాలంగా సంస్థలు AI స్థాయిని పెంచాలని అనుకున్నాయి కాని జిపియూ మౌలికసదుపాయాల సంక్లిష్టత, సందిగ్ధత మరియు నిషేధిత ఖర్చు వలన వెనక్కు తగ్గాయి. ఈ ప్రారంభముతో, భారీ-స్థాయి జిపియూ క్లస్టర్లు మరియు సూపర్పాడ్స్కు ప్రాప్యతను అందిస్తున్నాము.
తద్వారా అవి AI ఆశయాలు ఉన్న సంస్థలకు సరళమైనవి, పారదర్శకమైనవి, ఒక ఉద్దేశముతో నిర్మించబడినవిగా చేయబడ్డాయి. ఊహించదగిన పనితీరు, స్థిరత్వము, స్థాయిని అందించడము ద్వారా మా జిపియూ సూపర్‌పాడ్స్ ప్రధానంగా ఈ కథనాన్ని మారుస్తాయి. వినియోగదారులకు మరింత సాధికారతను అందించుటకు మేము వ్యాపారాలు తమ జిపియూ మోడల్ ను ఎంచుకొనుటకు, తమ క్లస్టర్ ను రూపొందించుకొనుటకు మరియు ఆర్కిటెక్చర్ మరియు ఖర్చులకు తక్షణ దృశ్యమానతను అందించేందుకు, మేము సూపర్పాడ్ కాన్ఫిగురేటర్ టూల్ ను సృష్టించాము.
ఈ ప్రారంభములో భాగంగా, ఈఎస్డిఎస్ తన ప్రత్యేక సూపర్పాడ్ కాన్ఫిగురేటర్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది సంస్థలు తమ AI మౌలికసదుపాయలను సంపూర్ణ ఖచ్ఛితత్వముతో రూపొందించుకునే వీలు కలిగిస్తుంది. టూల్ ను నావిగేట్ చేసే యూజర్లు వారికి ఇష్టమైన జిపియూ మోడల్ ను ఎంచుకోవచ్చు, కంప్యూట్ డెన్సిటి, మెమొరీ ప్రొఫైల్స్, స్టోరేజ్ టైర్స్ మరియు ఇంటర్ కనెక్ట్ ఎంపికలను కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు కాన్ఫిగురేటర్ ఆటోమాటిక్ గా ఒక పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడిన సూపర్పాడ్ ఆర్కిటెక్చర్ ను వారి పనిభారం అవసరాలకు తగినట్లు నిర్మిస్తుంది. ఈ వ్యవస్థ తక్షణమే పనితీరు అంచనాలను ఉత్పన్నం చేస్తుంది, కాన్ఫిగురేషన్స్ మరియు పారదర్శకమైన ఖర్చు అంచనాలను సిఫారసు చేస్తుంది, తద్వారా సంస్థలు అమలు చేసే ముందు సంపూర్ణ స్పష్టతతో తమ AI పరిసరాలను ప్రణాళిక చేసుకోవచ్చు, కొలవవచ్చు మరియు బడ్జెట్ చేసుకోవచ్చు.