Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈపీఎఫ్‌వో ఖాతాదారులల కోసం వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు

Advertiesment
ఈపీఎఫ్‌వో ఖాతాదారులల కోసం వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు
, బుధవారం, 17 మార్చి 2021 (20:39 IST)
పీఎఫ్‌ చందాదారులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. పీఎఫ్‌ ఖాతాదారులు చెమటోడ్చి సంపాదించే డబ్బులను మధ్యలో వ్యక్తులు తీసుకోకుండా ఉండేందుకు గాను కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌ ద్వారానే సులభంగా సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.
 
ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో తన పీఎఫ్‌ చందాదారుల కోసం కొత్తగా వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 రీజినల్‌ ఆఫీసులలో ఈపీఎఫ్‌వో వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. ఈపీఎఫ్‌వో ఖాతాదారులు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఈ క్రమంలోనే ప్రతి రీజియన్‌కు భిన్నమైన నంబర్‌ ఉంటుంది. 
 
ఇక ఆ నంబర్లను తెలుసుకునేందుకు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు తమకు సమీపంలో ఉన్న రీజనల్‌ ఆఫీస్‌కు చెందిన వాట్సాప్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. దీని వల్ల పీఎఫ్‌ ఖాతాదారులకు ఎదురయ్యే సమస్యలు అన్నీ త్వరగా పరిష్కారం అవుతాయి. అలాగే సేవలు అందించే సిబ్బంది ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 
 
ఇక పీఎఫ్‌ వాట్సాప్‌ నంబర్లను ఈపీఏఐజీఎంఎస్‌ పోర్టల్‌, సీపీజీఆర్‌ఏఎంఎస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, 24 గంటల కాల్‌ సెంటర్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ పీఎఫ్‌ ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ నగర మేయరుగా భాగ్యలక్ష్మి