Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాపిల్‌ ఐఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌... చంద్రబాబు కృషి ఫలించేనా?

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలిస్తే.. యాపిల్‌ ఐఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్

Advertiesment
Chandrababu Naidu
, ఆదివారం, 7 మే 2017 (11:47 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలిస్తే.. యాపిల్‌ ఐఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం యాపిల్‌ సంస్థ ప్రధాన నిర్వహణాధికారి (చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి) జెఫ్‌ విలియమ్స్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ భేటీలో రాష్ట్ర, యాపిల్‌ కంపెనీ బృందాలు ఆ సంస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌కు సంబంధించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. దీంతోపాటు రెండోరోజు పర్యటనలో ఐటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 12 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించేలా మూడు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో యాపిల్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విలియమ్స్‌ను చంద్రబాబు కోరారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రమని, వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇటీవలే యాపిల్‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. వారికి తిరుపతి, అమరావతి వద్ద స్థలాలను ప్రభుత్వం చూపించింది. అయితే యాపిల్‌ సంస్థ ఎక్కువగా తిరుపతివద్దే ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు టెక్కీ విడాకులు.. నీవు బాధలో ఉన్నావు.. నీవెంట నేనున్నాను.. అంటూ మోసం...