Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తకు టెక్కీ విడాకులు.. నీవు బాధలో ఉన్నావు.. నీవెంట నేనున్నాను.. అంటూ మోసం...

భర్త నుంచి విడాకులు పొందిన ఓ టెక్కీని మరో వ్యక్తి మోసం చేశాడు. ఆమె డబ్బుతో ప్లాట్ కొనుగోలు చేశాడు. అదే ప్లాట్‌తో ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రహస్యంగా వీడియోలో బంధించి.. చివరకు ఆ వీడియో చూపి బ్లాక్

Advertiesment
Woman techie
, ఆదివారం, 7 మే 2017 (11:31 IST)
భర్త నుంచి విడాకులు పొందిన ఓ టెక్కీని మరో వ్యక్తి మోసం చేశాడు. ఆమె డబ్బుతో ప్లాట్ కొనుగోలు చేశాడు. అదే ప్లాట్‌తో ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రహస్యంగా వీడియోలో బంధించి.. చివరకు ఆ వీడియో చూపి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళా టెక్కీ హైదరాబాద్ షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌, రాచకొండ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప. ఇంతలోనే వారిద్దరి మధ్య మనస్పర్థలు. అవి తారాస్థాయికి చేరాయి. చేసేదేమి లేక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ స్నేహం పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 
 
'నీవు బాధలో ఉన్నావు.. గతం గురించి మర్చిపో.. నీవెంట నేనున్నాను.. పాపను అల్లారుముద్దుగా చూసుకుంటా' అంటూ ధైర్యం చెప్పాడు. మంచి వ్యక్తిగా భావించిన ఆమె అతడి ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుక్కుని కాపురం పెడదామని నమ్మించాడు. ఏడు లక్షలు ఇవ్వగా సన్‌సిటీ వద్ద ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. అందులో కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. 
 
ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయపటపడింది. పడక గదిలోని దృశ్యాలను కెమెరాలో బంధించాడు. స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. తర్వాత ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు దూరం పెడుతున్నావని బాధితురాలు ప్రశ్నించగా.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అశ్లీల చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అతడి మాటలకు ఆమె షాక్‌ అయింది.
 
మొదటి భర్త పెట్టిన చిత్రహింసలు మరిచిపోక ముందే.. నమ్మించిన వ్యక్తి మోసంచేయడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. స్నేహితులు వారించి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోసగాడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను సైబరాబాద్‌ షీటీమ్స్‌ సహాయంతో సైబర్‌ పోలీసులు రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ జయలలిత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... వెనక్కి తగ్గను.. తాడోపేడో తెల్చుకుంటా?