బ్లాక్‌బెర్రీ నుంచి బీబీసీ 100-1 స్మార్ట్ ఫోన్.. 25న మార్కెట్లోకి..
బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 5 ఇంచ్ హెచ
బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'బీబీసీ100-1'ను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శనలో విడుదల చేయనుంది. దీని ధరకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో విడుదలయ్యే బ్లాక్‌బెర్రీ బీబీసీ100-1 ఫీచర్లు బోలెడున్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంకా ఈ ఫోనులో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలుంటాయని సంస్థ వెల్లడించింది. ఇంకా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 517ను కూడా ఈ మొబైల్ కలిగివుందని సంస్థ తెలిపింది.