Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో పోలీస్ సబ్ కంట్రోల్ రూంలు పనిచేయవు...!

నేరం జరిగిన వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా అందుబాటులో ఉండటం ముఖ్యం. ఎక్కడి నుంచో వచ్చి ఎంక్వైరీ చేసే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. నేరాలను అదుపుచేయడం కోసం పోలీసు వ్యవస్థను ప్రజలకు

Advertiesment
tirupati police control rooms
, బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:42 IST)
నేరం జరిగిన వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా అందుబాటులో ఉండటం ముఖ్యం. ఎక్కడి నుంచో వచ్చి ఎంక్వైరీ చేసే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. నేరాలను అదుపుచేయడం కోసం పోలీసు వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెబుతున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. అక్కడక్కడా ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూంలు ఎప్పుడూ మూతవేసి ఉండడమే ఇందుకు నిదర్శనం.
 
ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో రోజురోజుకు క్రైం రేటు పెరిగిపోతోంది. అమ్మాయిలపైన హెరాస్‌మెంట్లు, దొంగతనాలు, దోపిడీలు ఎక్కువవుతున్నాయి. పెట్రోలింగ్ పోవాల్సిన పోలీసులు నిద్రపోతున్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించడం కోసం అక్కడక్కడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినప్పటికీ అందులో డ్యూటీలు చేసే వారే కరువయ్యారు. పోలీస్టేషన్లు విరివిగా ఏర్పాటు చేయడం వీలు కాదు కాబట్టి కొన్ని పెద్ద పెద్ద సర్కిళ్ళలో సబ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 
 
ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు వీరు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగుతారు. కానీ ఆ సబ్ కంట్రోల్ రూంలో డ్యూటీలు చేసేవారు పూర్తిగా డుమ్మా కొడుతున్నారు. ఊరికే డ్యూటీలు రావడం, బైక్‌లు పార్కింగ్ చేయడం వెళ్ళిపోవడం ఇదే తంతుగా సాగుతోంది. ఆ కంట్రోల్ రూంలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటాయి. దీంతో వీటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నీరుగారిపోతోంది. సిబ్బందిని నియమించి అక్రమంగా పనిచేయించలేనప్పుడు రూ.లక్షలు ఖర్చుపెట్టి ఈ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం ఎందుకంటున్నారు ప్రజలు. 
 
తిరుపతిలో సబ్ కంట్రోల్ రూంలు సుమారు పదివరకు ఉన్పప్పటికీ ఏ ఒక్కదాంట్లో కూడా డ్యూటీ చేసే సిబ్బంది కనిపించడం లేదు. 24 గంటలూ తాళాలు వేసే ఉంటాయి. దీంతో ఏమన్నా జరిగితే మెయిన్ పోలీస్టేషన్ నుంచి పోలీసులు వచ్చేంత వరకు అక్కడి చర్యలు తీసుకునేవారు కరువు. దీని వల్ల చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేవారు ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. ఇప్పటికైనా కంట్రోల్ రూంలను పటిష్టం చేసి సిబ్బందిని నియమించాలని కోరుకుంటున్నారు తిరుపతి వాసులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలపై ఉగ్రవాదులు కన్నేశారా..! ఇంటిలిజెన్స్‌కు సంకేతాలు..?