Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరులో అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

Advertiesment
Asus

ఐవీఆర్

, మంగళవారం, 5 నవంబరు 2024 (00:00 IST)
దేశవ్యాప్తంగా బ్రాండ్ రిటైల్ కార్యకలాపాలను విస్తరింపజేసే దిశగా తైవాన్ టెక్ దిగ్గజం అసుస్ ఇండియా ఈరోజు నెల్లూరులో తమ ప్రత్యేకమైన స్టోర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. కొత్త ప్రత్యేకమైన స్టోర్ 213 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ డెస్క్‌టాప్‌లు, ఆల్-ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు, ఉపకరణాలు వంటి అసుస్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులతో సహా విస్తృతమైన ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్‌లను ప్రదర్శించటానికి ప్రత్యేక ఏర్పాట్లను కలిగి ఉంది. ఇది నెల్లూరులో ఉన్న బ్రాండ్ యొక్క మొదట స్టోర్ కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం స్టోర్ ల సంఖ్యను 10AES స్టోర్‌లకు తీసుకువెళ్లింది.
 
ఈ విస్తరణ గురించి నేషనల్ సేల్స్ మేనేజర్- పిసి&గేమింగ్ బిజినెస్, అసుస్ ఇండియా, జిగ్నేష్భావ్‌సర్ మాట్లాడుతూ, “భారతదేశంలో మా రిటైల్ కార్యకలాపాల విస్తరణను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌ లలో ఒకటిగా ఉంది, ఆశాజనక నగరంలో ఈ కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం, మా సరికొత్త ఆవిష్కరణల యొక్క ప్రత్యేకమైన అనుభవంతో దేశంలోని వివిధ ప్రాంతాలలోని వినియోగదారులను శక్తివంతం చేసే దిశగా నెల్లూరు కీలక అడుగు వేయనుంది. వ్యూహాత్మక రిటైల్ విస్తరణ విధానంతో, మేము మా వినియోగదారుల కోసం మరింత అనుసంధానితంగావుండేలా కొత్త టచ్ పాయింట్‌లను సృష్టించడం కొనసాగిస్తాము.." అని అన్నారు.
 
రిటైల్ స్టోర్ చిరునామా: షాప్ నెం:1, సుందర్ లాడ్జ్ కాంప్లెక్స్, ఆర్ టి సి బస్టాండ్ దగ్గర, అరవింద నగర్ రోడ్, సోమశేఖర పురం, నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ 524003.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీబీఈ పరీక్షను నిర్వహించనున్న FIIT JEE