Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20వేల మంది ఉద్యోగులను తొలగించిన అమేజాన్

Advertiesment
Amazon
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (09:46 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ 20,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇటీవల మెటా, ట్విటర్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలకగా, ఆ వరుసలో అమేజాన్ కూడా చేరింది. 
 
ఇటీవలి ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగానే ఈ తొలగింపులు జరిగినట్లు చెబుతున్నారు. అమేజాన్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతోందని గతంలో చెప్పగా, ఇప్పుడు 20 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సమాచారం. 
 
మొదటి స్థాయి ఉద్యోగుల నుంచి షాపు సిబ్బంది వరకు అన్ని విభాగాల్లోనూ ఈ లేఆఫ్ చేపడతామని చెబుతున్నారు. ఒకేసారి ఇంత మంది ఉద్యోగులను తొలగించడం అమేజాన్ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ పురుడు పోసుకుంది వూహాన్ ల్యాబ్‌లోనే...