Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2024లో దేశమంతటా 5జీ సేవలు.. ఆటోమేటిక్‌గా ఆ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయట?

5G technology
, సోమవారం, 17 అక్టోబరు 2022 (14:36 IST)
5G technology
5జీ సేవల గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే దేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణే, ఢిల్లీ నగరాల్లో 5జీ సేవలు వినియోగదారుకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా వున్నట్లు ఇప్పటికే టెలి కమ్యూనికేషన్ విభాగం ప్రకటన చేసింది.
 
కానీ కనెక్టివీటీ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, జియో మాత్రమే ఎంపిక చేసిన ప్రదేశాలలో 5జీ సేవలు అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులంతా పూర్తిగా 5జీ సేవలను పొందడం లేదు.
 
మరో ప్రధాన కంపెనీ వీఐ (వొడాఫోన్ ఐడియా) ఇంకా తమ 5జీ సేవల ప్రారంభ తేదీని ప్రకటించలేదు. వచ్చే నెలలో సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
 
భారత టెలీ కమ్యూనికేషన్స్ ప్రకారం 5జీ కనెక్టివిటీ దేశం మొత్తంలో రెండు, మూడేళ్లలో సరసమైన ధరల్లో అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశం అంతటా తమ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఎయిర్టెల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి కీలకమైన మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో దేశం అంతటా ప్రారంభించాలని చూస్తోంది. 4జీ కనెక్టివిటీ సిమ్ ఉన్న వినియోగదారులు 5 కనెక్టివిటీ కోసం కొత్త సిమ్ కొనుగోలు చేయనవసరం లేదని జియో, ఎయిర్ టెల్ ప్రకటించాయి. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ఆటోమేటిక్‌గా 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కాములో వైకాపా ఎంపీ తనయుడి వద్ద విచారణ