షియోమీ కొత్త రికార్డును నమోదు చేసుకుంది. చైనీస్ మొబైల్ మేకర్ అయిన షియోమీ భారత్‌లో గత రెండేళ్లలో 40 లక్షల ఎంఐ టీవీలను విక్రయించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. షియోమీ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీలకు కూడా మార్కెట్లో అంతే డిమాండ్ ఉంది. దీంతో ఆ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీలు భారత్‌లో హాట్‌కేకుల్లా అమ్మడువుతున్నాయి.
దేశంలో గత రెండేళ్ల కాలంలో 40 లక్షల ఎంఐ టీవీలను విక్రయించామని, వినియోగదారుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు షియోమీ ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 2018లో షియోమీ నుంచి తొలి ఎంఐ టీవీ మోడల్ 'ఎంఐ టీవీ4' విడుదలైంది. ఇది ప్రపంచంలోనే అతి పలుచనైన ఎల్‌ఈడీ టీవీ ఇదే కావడం గమనార్హం. 55 అంగుళాల ఈ టీవీ ధర రూ.39,999.