Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీకర బ్యాటింగ్, అద్బుత బౌలింగ్.. వరుస విజయాల పరంపరలో సన్ రైజర్స్

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రాభవం వెనుకపట్టు పట్టిన తర్వాత టోర్నీలో అన్ని టీమ్‌ల కంటే ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్ కేప్టెన్లలో ప్రస్త

Advertiesment
Sunrisers Hyderabad
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (07:31 IST)
ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రాభవం వెనుకపట్టు పట్టిన తర్వాత టోర్నీలో అన్ని టీమ్‌ల కంటే ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్ కేప్టెన్లలో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న వార్నర్ ఐపీఎల్ 10 సీజన్‌లోనూ వరుస విజయాల పరంపరతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్ జట్లను చిత్తుగా ఓడించిన వార్నర్ జట్టు ముంబై ఇండియన్స్‌తో స్థానిక వాంఖడే స్డేడియంలో నేడు జరుగనున్న మ్యాచ్‌లోనూ గెలుపు సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఉత్సాహంతో ఉంది.
 
 
మరోవైపు తొలిమ్యాచ్‌లో ఓడినా.. కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ముంబై అదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇటీవల భారత పర్యటనలో విఫలమైన వార్నర్‌ తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ముంబైని తీవ్రంగా కలపరపరుస్తోంది. మరోవైపు సహచరుడు, ఆల్‌రౌండర్‌ మోజెస్‌ హెన్రిక్స్‌ కూడా రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. భారత డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ చెలరేగుతుండడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కన్పిస్తోంది.  
 
నిజానికి తొలి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగానికి పెద్దగా పరీక్ష ఎదురుకాలేదు.  టోర్నీలో టాప్‌ ఆర్డర్‌ రాణించడంతో జట్టు ఆనందంగా ఉంది. మరోవైపు జట్టు బౌలింగ్‌ విభాగం కూడా అదరగొడుతోంది. అఫ్గాన్‌ సంచలనం స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఐదు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. సీనియర్లు భువనేశ్వర్, ఆశిష్‌ నెహ్రా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు.
 
ఇప్పటికే రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్‌ ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరో విజయం కోసం ముంబై ఇండియన్స్‌తో నేడు తలపడనుంది. సన్‌రైజర్స్‌ ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌ 10 సీజన్‌లో తొలిశతకం.. పుణెను చిత్తు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్