Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌ 10 సీజన్‌లో తొలిశతకం.. పుణెను చిత్తు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్

ఐపీఎల్‌ పదో సీజన్‌లో తొలి అద్బుతం జరిగింది. ఈ సీజన్‌లోనే తొలి శతకం బాదిన మలయాళీ బ్యాట్స్‌మన్ శాంసన్ రికార్డు సృష్టించగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ చిత్తుచిత్

Advertiesment
ఐపీఎల్‌ 10 సీజన్‌లో తొలిశతకం.. పుణెను చిత్తు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (05:41 IST)
ఐపీఎల్‌ పదో సీజన్‌లో తొలి అద్బుతం జరిగింది. ఈ సీజన్‌లోనే తొలి శతకం బాదిన మలయాళీ బ్యాట్స్‌మన్ శాంసన్ రికార్డు సృష్టించగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మరోవైపు దిల్లీ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణెను దిల్లీ బౌలర్లు ఏ స్థితిలోనూ కోలుకోనివ్వలేదు. దీంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. 97 పరుగుల తేడాతో డేర్‌ డెవిల్స్‌ ఘన విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్‌(102 63 బంతుల్లో 8×4, 5×6)శతకంతో రాణించడంతో నాలుగు వికెట్లకు దిల్లీ 205 పరుగులు చేసింది.
 
బౌలింగ్‌లో తేలిపోయిన పుణె కనీసం బ్యాటింగ్‌లోనైనా తమ సత్తా చాటుకోలేకపోయింది. ఏ ఒక్క ఆటగాడు కూడా పోరాట పటిమ కనబర్చలేకపోయాడు. దీంతో ఘోర పరాభవం తప్పలేదు. పుణె ఓపెనర్లు రహానె(10), మయాంక్‌ అగర్వాల్‌(20)లను దిల్లీ సారథి జహీర్‌ఖాన్‌ ఆరంభంలోనే పెవిలియన్‌ పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌(8), రాహుల్‌ త్రిపాఠి(10) ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోయారు. 
 
వేలంలో అత్యధికంగా రూ.14.5కోట్లను వెచ్చించి జట్టులోకి తీసుకున్న బెన్‌స్టోక్స్‌(2) అటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మహేంద్రసింగ్‌ ధోని(11) సైతం ఆదుకోలేకపోయాడు. తర్వాత వచ్చిన రజత్‌ భాటియా(16), చాహర్‌(14) ఎక్కువసేపు నిలవలేదు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేస్తూ వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు. ఏ ఒక్క ఆటగాడు కూడా వ్యక్తిగతంగా గౌరవప్రదమైన స్కోరు చేయలేక చేతులెత్తేయడంతో పుణె భారీ ఓటమిని ఎదుర్కొంది. 
 
ఐపీఎల్ 10 ఆరంభంలోనే  రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌ యాజమాన్యం జట్టు కెప్టెన్‌గా ధోనీని మార్చడమే కాకుండా అడుగడుగునా అతడిని అవమానపర్చేలా వ్యవహరించడంతో ధోనీ అభిమానులు మండిపడ్డారు. జట్టు యాజమన్యం నెగటివ్ ఆలోచనలే జట్టు విజయాలపై ప్రభావం చూపుతున్నాయా అని సందేహం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం వెరైటీగా తీర్చుకున్న ఆధునిక పతివ్రత