Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య వస్తోందంటే ఆ కిక్కే వేరప్పా... భారత్ వస్తున్నా అనడంతోటే బాది చూపించాడు మరి!

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విరుచుకుపడి ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ తన విజృంభణకు అసలు కారణాన్ని చెప్పేశాడు. ఈ సీజన్‌లో గాయాలతో ఇక ఆడలేనేమో అని డీలాపడిన డివీలర్ తన భార్య చేసిన ఒక్క ఫోన్ కాల్‌త

భార్య వస్తోందంటే ఆ కిక్కే వేరప్పా... భారత్ వస్తున్నా అనడంతోటే బాది చూపించాడు మరి!
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (07:56 IST)
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విరుచుకుపడి ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటిన బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ తన విజృంభణకు అసలు కారణాన్ని చెప్పేశాడు. ఈ సీజన్‌లో గాయాలతో ఇక ఆడలేనేమో అని డీలాపడిన డివీలర్ తన భార్య చేసిన ఒక్క ఫోన్ కాల్‌తో తన అలసటను, నిరాశను పొగొట్టుకుని ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌ మ్యాచ్‌లో బాగా ఆడతానో లేనో అని తనపై తనకే అనుమానం ఉన్న వేళ అజేయ అర్ధశతకం బాదాడు.
 
నిజానికి ఈ మ్యాచ్‌లో ఆడతానని తాను అనుకోలేదని తాను తిరిగి మైదానంలో దిగడానికి తన భార్య డానియలె స్వార్ట్‌ కారణమని చెప్పాడు ఏబీ. ‘‘ఐపీఎల్‌లో పునరాగమనం వెనుక నా భార్య ఉంది. ఆమె చెప్పిన మాటలే నాలో మానసిక స్థైరాన్ని నింపాయి. బరిలో దిగలేనేమోనన్న ఆందోళనను తీసివేశాయి. నేనూ భారత్‌కు వస్తూన్నా అన్న ఆమె మాటలు మరింత స్ఫూర్తినిచ్చాయి. పంజాబ్‌పై నేను ఆడిన కొన్ని షాట్లు ఆశ్యర్య పరిచాయి’’ అని డివిలియర్స్‌ చెప్పాడు. పంజాబ్‌పై ఏబీ 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి పునరాగమనాన్ని ఘనంగా చాటిన సంగతి తెలిసిందే.
 
బెంగళూరు ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ మైక్‌ ద్వారా డివిలియర్స్‌తో మాట్లాడాడు. మ్యాచ్‌ ముందు అలసిపోయినట్లు కనిపించిన ఏబీడీ అంతగా చెలరేగిపోవడానికి కారణం ఏంటని అడిగాడు. ‘నా ఇన్నింగ్స్‌ను నమ్మలేకపోతున్నా. కొన్ని రోజులుగా నాపై నాకే అనుమానం. అందుకే మ్యాచ్‌కు ముందు నా భార్యకు ఫోన్‌చేశా. ఆడగలనో లేదో అనుమానం ఉందన్నా. అప్పుడామె నా కొడుకు పక్కన తలవాల్చింది. ఆందోళన పడకు. రేపు (మంగళవారం) వచ్చేస్తున్నా. ప్రశాంతంగా ఉండమంది. అదే నాకు స్ఫూర్తినిచ్చిందని అనుకుంటున్నా’ అని ఏబీ అన్నాడు. 
 
అయితే డివీలర్స్ చితకబాదేసిన ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 148/4 పరుగులు చేయగా పంజాబ్‌ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి డివీలర్ సుడిగాలి ప్రభావాన్ని తగ్గించేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీకర బ్యాటింగ్, అద్బుత బౌలింగ్.. వరుస విజయాల పరంపరలో సన్ రైజర్స్