Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రారంభమైన చోటికే తిరిగి వెళ్తున్నా.. ఇన్‌స్టా రీల్స్‌కి..? డేవిడ్ వార్నర్

Advertiesment
ప్రారంభమైన చోటికే తిరిగి వెళ్తున్నా.. ఇన్‌స్టా రీల్స్‌కి..? డేవిడ్ వార్నర్
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (13:28 IST)
David warner
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రాబోయే సీజన్ కోసం ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీతో కెరీర్ ప్రారంభించిన వార్నర్ క్యాపిటల్స్ తరఫున ఐపిఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ చేత కొనుగోలు అయ్యాడు. దీంతో ఢిల్లీ టీమ్‌తో చేరేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 
 
దీనిపై సోషల్ మీడియాలో వార్నర్ మాట్లాడుతూ.. "ఇదంతా ప్రారంభమైన చోటికి తిరిగి!! నా కొత్త సహచరులు, యజమానులు, కోచింగ్ సిబ్బందిని కలవడానికి హ్యాపీగా వుంది. @delhicapitals యొక్క కొత్త మరియు పాత అభిమానులందరినీ కలవడానికి సంతోషిస్తున్నాను, నా ఫోటోషాప్‌ను ఇష్టపడే #india #ipl #cricket కొన్ని కొత్త రీల్స్ కోసం నాకు కొన్ని సిఫార్సులు అవసరం" అని వార్నర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జెర్సీలో తన చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
 
సన్ రైజర్స్ హైదరాబాద్‌ను 2016లో వారి తొలి ఐపిఎల్ టైటిల్‌‌ను కైవసం చేసుకునేలా చేశాడు. 41.59 సగటుతో 150 మ్యాచ్‌ల్లో 5449 పరుగులు చేసిన సౌత్ పా ఐపిఎల్ చరిత్రలో ఐదో అత్యధిక పరుగులు సాధించిన ఆటగా నిలిచాడు. అతని ఖాతాలో నాలుగు సెంచరీలు 50 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL Auction 2022 శనివారం ఐపీఎల్ వేలం: 64 మంది అమ్ముడుపోయారు