కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రతిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్లో చెన్నై బౌలర్లపై విరుచుకు పడింది.
రోహిత్ శర్మ..డికాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్ మొదటి బంతికే రోహిత్ బౌండరీ చేశాడు. చహార్ వేసిన మొదటి బంతిని కవర్స్ లోకి బౌండరీగా తరలించాడు. తరువాత నాలుగో బంతిని డికాక్ బౌండరీకి తరలించాడు. దీంతో మొదటి ఓవర్ ముగిసేసరికి 12 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.
అదే ఊపును కొనసాగించిన ముంబై ఇండియన్స్‌ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు చావ్లా. రోహిత్ శర్మ కురేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాతి ఓవర్లోనే కూరెన్ బౌలింగ్‌లో రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్. ఈసారి డికాక్ 33(20) అవుట్ అయ్యాడు.
ఓపెనర్లు ఇద్దరినీ వరుసగా కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఇబ్బందుల్లో పడింది. తర్వాత బరిలోకి దిగిన యాదవ్ (17), తివారీ (42), పాండ్యా (14) పరుగులు సాధించారు. ప్రస్తుతం పోలార్డ్ (18), పాటిసన్ (7)లు క్రీజులో వున్నారు. దీంతో ఆరు వికెట్ల పతనానికి ముంబై 150 పరుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో చాహర్, కుర్రాన్, ఎన్