Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి ఐపీఎల్ : ఉప్పల్ వేదికగా తొలి సమరం.. సన్‌రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో అంచెకు రంగం సిద్ధమైంది. గతేడాది చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరులో తలపడనున్నాయి. హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర

నేటి నుంచి ఐపీఎల్ : ఉప్పల్ వేదికగా తొలి సమరం.. సన్‌రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో అంచెకు రంగం సిద్ధమైంది. గతేడాది చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి పోరులో తలపడనున్నాయి. హైదరాబాద్‌, ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో గెలిచి పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. 
 
సొంతగడ్డపై అనుకూలతలతో పాటు కీలక ఆటగాళ్లంతా అందుబాటులో ఉండటంతో సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టును ముందుండి నడిపించే వార్నర్‌ హైదరాబాద్‌కు కొండంతబలం కాగా... యువరాజ్‌, ధవన్‌, కేన్‌ విలియమ్సన్‌, భువనేశ్వర్‌, ఆశీష్‌ నెహ్రా, క్రిస్‌ జోర్డాన్‌ వంటి ఆటగాళ్లతో దుర్భేద్యంగా కనిపిస్తోంది. 
 
అలాగే, లీగ్‌ మొదలవకముందే ఆటగాళ్ల గాయాలతో బెంగళూరు ఒత్తిడిలోకి వెళ్లింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో గాయపడ్డ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సగం టోర్నీకి దూరమయ్యాడు. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌, మిచెల్‌ స్టార్క్‌ ఈ సీజన్‌ నుంచి తప్పుకోగా.. ఏబీ డివిల్లీర్స్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తొలగిపోలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఏబీ ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఇదే పెద్దదెబ్బ అనుకుంటే.. హార్డ్‌ హిట్టర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో ప్రాక్టీస్‌ సందర్భంగా సర్ఫ్‌రాజ్‌ గాయపడ్డాడు. ఇప్పటికే కోహ్లీ జట్టుకు దూరామైన విషయం తెల్సిందే. 
 
మరోవైపు... మంగళవారం రాత్రి నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్‌లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది. దాంతో, పిచ్‌ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్ష సూ చన లేకున్నా ఒక్కసారిగా నగరంలో భారీవర్షం కురియడంతో మ్యాచ్‌ నిర్వాహకులు గాబరా పడుతున్నారు. మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు కూడా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వయసులో ఫాస్ట్ బౌలింగా.. అంతే అంటున్న నెహ్రా