హైదరాబాద్‌లో 5న తలపడనున్న క్రికెట్ కొదమ సింహాలు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో తొలి మ్యాచ్ ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ ఆరంభ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో... భారత్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాళ్లు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ ముందు వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని యువీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. గేల్‌ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాహో.. సింధు... వరుస విజయాలతో దూకుడు... రియో ఓటమికి ప్రతీకారం