Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాహో.. సింధు... వరుస విజయాలతో దూకుడు... రియో ఓటమికి ప్రతీకారం

విశ్వక్రీడల్లో బంగారు కలను ఛిద్రం చేసిన కరోలినా మారిన్‌ను దెబ్బకు దెబ్బ కొట్టాలన్న కసి..! తనకు అందనంటున్న టైటిల్‌ను ఎలాగైనా ఒడిసిపట్టేయాలన్న కసి..! ఒకే దెబ్బకు రెండు ఘనతలూ అందుకోవాలన్న కసి..! అందుకే..

Advertiesment
సాహో.. సింధు... వరుస విజయాలతో దూకుడు... రియో ఓటమికి ప్రతీకారం
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (09:24 IST)
విశ్వక్రీడల్లో బంగారు కలను ఛిద్రం చేసిన కరోలినా మారిన్‌ను దెబ్బకు దెబ్బ కొట్టాలన్న కసి..! తనకు అందనంటున్న టైటిల్‌ను ఎలాగైనా ఒడిసిపట్టేయాలన్న కసి..! ఒకే దెబ్బకు రెండు ఘనతలూ అందుకోవాలన్న కసి..! అందుకే.. తన శాయశక్తులూ ధారపోసి ఆడింది..! అన్ని అస్త్రాలను సంధిస్తూ చెలరేగిపోయింది..! ఫలితంగా ప్రతిష్టాత్మక ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీని పి.వి.సింధు కైవసం చేసుకుంది. 
 
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడిన సింధు ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు వరుస సెట్లలో మారిన్‌ను 21-19, 21-16 తేడాతో సింధు విజయం సాధించింది. కాగా, తొలి గేమ్‌లో సింధు తొలుత మారిన్‌పై ఆధిపత్యం కనబరిచింది. తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. 
 
ఓ దశలో నువ్వా? నేనా? అన్నట్లు వారు తలపడ్డారు. మ్యాచ్ ఆఖర్లో సింధు తన అద్భుతమైన ఆటతీరుతో మొదటి గేమ్‌ను 21-19 తేడాతో కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. చివరకు 21-16 తేడాతో ముగించి సింధు పైచేయి సాధించింది. సింధు తన కెరీర్‌లో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకొని అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని పంచింది. 
 
ఈ విజయంపై ఆమె స్పందిస్తూ ఈ మ్యాచ్‌లో చాలా బాగా ఆడాను. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. మారిన్‌ కూడా బాగా ఆడింది. మా ఇద్దరికీ తొలిగేమ్‌ చాలా కీలకం. ఆరంభంలో ఇద్దరం పాయింట్‌ కోసం ఎంతో శ్రమించాం. సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. ఓవరాల్‌గా ఇది మంచి మ్యాచ్‌. ఈ ఏడాది చైనా ఓపెన్‌ తర్వాత నేను గెలిచిన టైటిల్‌ ఇది. ఇక ఈ మ్యాచ్‌లో ప్రేక్షకుల మద్దతు బాగుంది. స్టేడియంలోని వారంతా మా ఇద్దరికీ మద్దతు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్-10: బెంగళూరుకు మరో దెబ్బ.. డివిలియర్స్‌కు వెన్నునొప్పి.. డౌటేనా?