Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌లోనే అతను బెస్ట్ బౌలర్.. కానీ ఆరోజు ధోనీ రోజు..ఎవరైనా తేలిపోవలసిందే

ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ సైతం ధోనీ చెలరేగిన రోజు ఏమీ చేయలేడని, కానీ అయిదేళ్లుగా భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతూ వచ్చిన క్రమం నాకు తెలుసని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ

ఐపీఎల్‌లోనే అతను బెస్ట్ బౌలర్.. కానీ ఆరోజు ధోనీ రోజు..ఎవరైనా తేలిపోవలసిందే
హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (07:40 IST)
ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ సైతం ధోనీ చెలరేగిన రోజు ఏమీ చేయలేడని, కానీ అయిదేళ్లుగా భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతూ వచ్చిన క్రమం నాకు తెలుసని సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్ మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడిన ధోని ఏకంగా 19 పరుగులు రాబట్టి రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ని చివరికి గెలిపించిన విషయం తెలిసిందే. 
 
ధోని ఓ క్లాస్ క్రికెటర్.. అతను చెలరేగితే ఏం చేయలేం. ప్రతి బౌలర్ అన్నివేళలా విజయవంతం కాలేడు. ఆ రోజు భువనేశ్వర్ కుమార్ కూడా యార్కర్లతో కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. అది ధోని రోజు అంతే. గత ఐదేళ్ల నుంచి భువీని చూస్తున్నాను. ఐపీఎల్‌లోనే అతను బెస్ట్ బౌలర్. పవర్‌ప్లేలో రెండు ఓవర్లు వేసి.. మళ్లీ చివర్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. కానీ అతని ఎకానమీ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. వివిధ కారణాలతో భారత్ తరఫున అతను ఎక్కువ టీ20లు ఆడలేకపోతున్నాడు’ అని మురళీధరన్ విచారం వ్యక్తం చేశాడు.
 
టోర్నీలో ఇప్పటి వరకు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ తొలిసారి ధోని ముందు తేలిపోయాడు. పుణె జట్టు యాజమాన్యం తనను ఘోరంగా అవమానించినప్పటికీ ఆగ్రహించని ధోనీ ఐపీఎల్ 10 సీజన్‌లోనే మరపురాని ఇన్నింగ్స్ ఆడి జట్టు యాజమన్యంతో సహా అందరినీ విభ్రాంతిలో ముంచాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతి విశ్వాసమే కొంప ముంచిందా.. ముంబైని చిత్తు చేసిన పుణె.. రోహిత్‌ శర్మ పోరాటం వృథా