Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతి విశ్వాసమే కొంప ముంచిందా.. ముంబైని చిత్తు చేసిన పుణె.. రోహిత్‌ శర్మ పోరాటం వృథా

ఐపీఎల్‌ పదో సీజన్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. వరుస విజయాలతో జోరు మీదున్న ముంబయి ఇండియన్స్‌ను ఆ జట్టు సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన

Advertiesment
IPL-10
హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (02:12 IST)
ఐపీఎల్‌ పదో సీజన్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. వరుస విజయాలతో జోరు మీదున్న ముంబయి ఇండియన్స్‌ను ఆ జట్టు సొంతగడ్డపై ఓడించి సత్తా చాటింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పుణె 3 పరుగుల తేడాతో గెలుపొందింది. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్న రోహిత్ శర్మ సేనకు నిరాశే ఎదురైంది. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అర్ధశతకంతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ముంబయి 157 పరుగులు చేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పుణె 6 వికెట్లకు 160 పరుగులు చేసింది.
 
వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్‌ అతివిశ్వాసంతో బరిలోకి దిగి ఓటమి పాలైంది. ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబైపై 3 పరుగులు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ అద్భుత విజాయాన్ని సాధించింది. టీం మెంటర్ భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్న రోహిత్ శర్మ సేనకు నిరాశే ఎదురైంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
 
పుణే ఓపెనర్లు రహానే 5 ఫోర్లు 1 సిక్సర్ తో 38 పరుగులు, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరద్దరిని కృనాల్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. స్మిత్(17), బెన్ స్టోక్స్(17), మనోజ్ తివారీ (22) పరుగులు చేశారు. ధోని(7) నిరాశపరిచాడు. తివారీ చివర్లో వేగంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో పుణే 160 పరుగుల మార్క్‌ను చేరుకుంది. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు  రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది.
 
డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఉన్న జట్టుకు 161 పరుగులు సాధారణ లక్ష్యమే. కానీ అతి విశ్వాసంతో ఆడిన ముంబై బ్యాట్స్‌మెన్ అనవసర షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి వికెట్ కు 4.2 ఓవర్లలో 35 పరుగులు జోడించాక బట్లర్ (17)ను స్టోక్స్ ఔట్ చేశాడు. పార్థీవ్ పటేల్ (33) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫె సెంచరీ (39 బంతుల్లో 58 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ముంబై విజయానికి చివరి ఓవర్లలో 17 పరుగులు అవసరం కాగా, ఆఖరి వేసిన పుణే బౌలర్ ఉనత్కద్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా(13)ను, నాలుగో బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. ఐదో బంతికి మెక్ క్లీనగన్ రనౌటయ్యాడు. ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా చివరి బంతికి భజ్జీ సిక్స్ కొట్టిన ప్రయోజనం లేకపోయింది. దీంతో పుణే వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తాను వేసిన నాలుగు ఓవర్లలో ఓ మెయిడిన్ తో పాటు రెండు కీలక వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
----------------------

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక్కడ ప్రత్యర్థితో.. అక్కడ ఆమెతో రోహిత్ శర్మ ఊహించని షాట్లు... రితికా షాక్ (Video)