Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్‌లో సన్ రైజర్స్

దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంతికి పదునుపెట్టి దెబ్బ తీయడంతో ముంబై ఇండియన్స్ జట్టు అవమానకరమైన రీతిలో చివరి ఓవర్

Advertiesment
IPL-10
హైదరాబాద్ , శుక్రవారం, 12 మే 2017 (02:48 IST)
దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంతికి పదునుపెట్టి దెబ్బ తీయడంతో ముంబై ఇండియన్స్ జట్టు అవమానకరమైన రీతిలో చివరి ఓవర్లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ గెలవడంతో ప్లే ఆఫ్‌ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ఏ జట్టు గెలిస్తే ఏ జట్టు ప్లే ఆఫ్ ఆశలు నిలుస్తాయో.. పట్ మంటాయో చూద్దాం.
 
శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్‌ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. శనివారం గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్‌ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్‌ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు ఓడిపోవాలి.
 
శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్‌.. పుణే, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదనిపిస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...