Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...

ఏ జట్టయినా మైదానంలో గెలిచాక హోటల్‌కు వెళ్లి పండగ చేసుకుంటుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గెలుపు సాధించిన ప్రతిసారీ క్లబ్ వాతావరణం పెవిలియన్ చేరుకున్న వెంటనే ఆటగాళ్లకు కనిపిస్తోంది. కారణం పంజాబ్

Advertiesment
పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...
హైదరాబాద్ , శుక్రవారం, 12 మే 2017 (02:39 IST)
ఏ జట్టయినా మైదానంలో గెలిచాక హోటల్‌కు వెళ్లి పండగ చేసుకుంటుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గెలుపు సాధించిన ప్రతిసారీ క్లబ్ వాతావరణం పెవిలియన్ చేరుకున్న వెంటనే ఆటగాళ్లకు కనిపిస్తోంది. కారణం పంజాబ్ గెలిచిన వెంటనే జట్టు యజమాని ప్రీతి జింటా కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే. అదీ మామూలు కౌగిలింత కాదు. ఏ ఆదునిక యువతి అయినా తన ప్రియుడికి మాత్రమే ఇచ్చే ప్రగాఢమైన కౌగిలింతను ప్రీతీ జింటా జట్టు కెప్టెన్‌కో ఆరోజు బాగా ఆడిన జట్టు ఆటగాడికో ఉదారంగా పంచిపెడుతోంది.
 
గురువారం ముంబై ఇండియన్స్ జట్టుపై పంజాబ్ జట్టు చెమటోడ్చి మరీ గెలుపు సాధించగానే పెవిలియన్‌లో లేచి నిలబడి ఉగ్గబట్టుకుని చూస్తున్న ప్రీతి జింటా ఒక్కసారిగా విజయ నాదం చేసి పక్కనున్న విదేశీ ఆటగాడిని గట్టిగా కౌగలించేసుకుంది. ఆ తర్వాత అటువైపు ఉన్న జట్టు రిజర్వ్ ఆటగాడిని హగ్ చేసుకుంది. పంజాబ్ జట్టు గెలిచిన ఆనందం ఏమిటో కానీ ప్రీతీ జింటా మాత్రం ఇలా తమ జట్టు గెలిచిన ప్రతిసారీ  జట్టు సభ్యులకు కౌగలింతలు ఇచ్చి ఉత్సాహపర్చడం ఐపీఎల్ 10 సీజన్‌లోని ఇతర జట్లను అసూయలో ముంచెత్తుతోంది. తామెంత బాగా ఆడి గెలిచినా తమను అలా బిగి కౌగిలింతల్లో ముంచెత్తే వారే కరువయ్యారని ఇతర జట్లు తెగ ఫీలవుతున్నాయట. 
 
ఇప్పటికే గురువారం మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను మట్టిగరపించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇలా ప్రీతీ జింటా కౌగిలింతలతో ఆనంద పరుస్తుంటే ఫైనల్ చేరినా చేరవచ్చు. కప్పు గెలవా గెలవవచ్చు అంటూ నెటిజన్లు మేళమాడుతున్నారు. ప్రీతి జింటా కౌగిలింత జట్టు ప్లేయర్‌లకు అంత కిక్ ఇస్తోందా. ఏమో మరి. ఎవరికి తెలుసు?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహోరే.. బాహుబలి కాదు సాహోరే.. పంజాబ్‌: బంతికీ బ్యాట్‌కి మధ్య పోటీలో బంతి విన్నర్