Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్‌ గుర్తుకువచ్చారు: సుమంత్‌ అశ్విన్‌ ఇంటర్వూ( రైట్ రైట్)

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు కుమారునిగా 'తూనీగా..తూనీగా..'తో నటుడిగా తెరంగేట్రం చేసిన సుమంత్‌ అశ్విన్‌. 'అంతకుముందు ఆ తర్వాత'.. 'కేరింత' వంటి భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా 'రైట్‌రైట్‌'

రజనీకాంత్‌ గుర్తుకువచ్చారు: సుమంత్‌ అశ్విన్‌ ఇంటర్వూ( రైట్ రైట్)
, మంగళవారం, 7 జూన్ 2016 (19:37 IST)
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు కుమారునిగా 'తూనీగా..తూనీగా..'తో నటుడిగా తెరంగేట్రం చేసిన సుమంత్‌ అశ్విన్‌. 'అంతకుముందు ఆ తర్వాత'.. 'కేరింత' వంటి భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా 'రైట్‌రైట్‌' అనే చిత్రాన్ని చేశాడు. 'బాహుబలి' ప్రభాకర్‌ డ్రైవర్‌గా తను కండక్టర్‌గా నటించిన ఈ చిత్రంలో తమ ఇద్దరి పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నాడు. 'రైట్‌ రైట్‌' అనే టైటిల్‌ను.. కథ ప్రకారం ఎప్పుడో రిజిష్టర్‌ చేశామనీ. 'శ్రీమంతుడు'లో మహేష్‌ బాబు సెకండాఫ్‌లో ఓ సందర్భంలో అన్న డైలాగ్‌ను చూసి పెట్టలేదని తేల్చిచెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమంత్‌ అశ్విన్‌ చెప్పిన విశేషాలు.
 
కండక్టర్‌ డ్రెస్‌తోనే ప్రచారం చేస్తున్నారే?
అవును. ఈ సినిమా విడుదలయి మంచి టాక్‌ వచ్చేవరకు ఇలా చేయాలని నేను, ప్రభాకర్‌ నిర్ణయించుకున్నాం.
 
విలన్‌గా చేసిన ప్రభాకర్‌తో నటించేముందు ఎలా అనిపించింది?
సహజంగా హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటే బాగా పండుద్ది అంటారు. కానీ ఇక్కడ నాకూ, ప్రభాకర్‌కూ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే 25 రోజులపాటు ఫస్ట్‌ షెడ్యూల్‌ అయ్యాక.. సెకండ్‌ షెడ్యూల్‌ రేపటి నుంచి చేస్తున్నట్లు కోడైరెక్టర్‌ చెప్పాడు. అప్పుడు కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే..ఆ సీన్లు చాలా కీలకం. కంటతడి పెట్టించే దృశ్యాలున్నాయి. అందుకే దర్శకుడితో ఒక్కరోజు పర్మిషన్‌ తీసుకుని అందుకు ఇద్దరం సిద్ధమయ్యాం. షాట్‌ షాట్‌కు మధ్య 10 నిముషాల గ్యాప్‌ కూడా తీసుకుని.. సన్నివేశాలు ఎలా పండించాలో అలాగే చేయగలిగాం. 
 
ట్రైలర్‌కు ఎలాంటి స్పందన వచ్చింది?
ట్రైలర్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. 'అల్లిబిల్లి..' అనే పాటలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందనీ.. క్యూట్‌గా వుందని వ్యూవర్స్‌ ఎంతోమంది చెప్పడం.. తొలి విజయంగా భావిస్తున్నాం.
 
మారుమూల ప్రాంతంలో షూటింగ్‌ చేయడానికి కారణం?
కథ రీత్యా మారుమూల గ్రామం కావాలి. అందుకు అరకు, ఒరిస్సా బోర్డర్‌ అయిన గవిటిని ఎంపిక చేశాం. అక్కడ విద్యుత్‌ వుండదు. సెల్‌ఫోన్లు అస్సలు పనిచేయవు. క్రూరమృగాలు సంచరించే ప్రాంతం కూడా అయి వుండాలి. అది ఆ ప్రాంతానికి కరెక్ట్‌గా సరిపోయింది.
 
కండెక్టర్‌గా మీ కథేమిటి?
పోలీసు ఆఫీసర్‌ అవ్వాలనుకునే కుర్రాడి కథ. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కండెక్టర్‌ అవుతాడు. కొత్తగా ఆ ఊరికి కండెక్టర్‌గా విధుల్లోకి వస్తాడు. అప్పుడు ఆ బస్‌ డ్రైవర్‌కూ, కండెక్టర్‌కు మధ్య, ఆ ఊరికి జనాలకు మధ్య జరిగే కథ ఈ చిత్రం.
 
బస్‌ పాత్ర ఏమిటి?
ఇందులో కథే హీరో. బస్‌ కూడా ఓ పాత్ర పోషిస్తుంది. సెకండాఫ్‌లో కీలకమైన సన్నివేశంలో ఊరంతా ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో బస్‌ రావడం.. చిత్రంలో ప్రధానమైన పాయింట్‌. బస్‌ కోసం ఎందుకు అంతగా ఎదురుచూస్తున్నారనేది చిత్రంలో చూస్తేనే బాగుంటుంది.
webdunia
 
ఇది లవ్‌స్టోరీనా?
ప్రేమకథ కంటే.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. 'దృశ్యం' తరహాలో వుంటుంది. కొన్ని ట్విస్ట్‌లు వుంటాయి. ఆసక్తికరంగా సాగుతుంది.
 
నటుడిగా ఎంతవరకు ఉపయోగపడుతుంది?
ఇంతవరకు ఇటువంటి పాత్ర చేయలేదు. 'అంతకుముందు ఆ తర్వాత' సహజీవనం కాన్సెప్ట్‌తో తీసింది. 'కేరింత' అనేది మెచ్యూర్డ్‌ పాత్ర. ఈ చిత్రం భిన్నమైంది. కథ, పాత్రపరంగా పదేళ్ళపాటు చెప్పుకునేట్లుగా వుంటుంది. ఈ పాత్ర చేయడం చాలా ఆనందంగా వుంది.
 
కండెక్టర్‌ అనగానే ఎవరు గుర్తుకువచ్చారు?
మొదటగా గుర్తుకువచ్చింది రజనీకాంత్‌ గారే. ఆయన నటించిన కొన్ని సినిమాలు పరిశీలించాను. కండెక్టర్‌ ఎలా వుండాలి. మారుమూల కండెక్టర్లు ఎలా వుంటారనేది గ్రహించాను.
 
'ఆర్డినరీ' చిత్రంలో మార్పులు చేశారా?
మలయాళ ఆర్డినరీ చిత్రంలో కొన్ని మార్పులు మన నేటివిటీగా మార్చాం. ముందు నార్త్‌లో ఓ చోట సెట్‌వేసి గ్రామీణ వాతావరణంలో తీయాలనుకున్నాం. కానీ ఒరిజినాలిటీ రాదని.. అరకు తదితర ప్రాంతాలు వెళ్ళి పరిశీలించి అక్కడే తీయాలనుకున్నాం.
 
'బాహుబలి'తోనే ప్రభాకర్‌ ఫేమస్‌ అయ్యాడు. మరి సాఫ్ట్‌పాత్రకు ఎలా న్యాయం చేశాడు?
ప్రభాకర్‌ విలన్‌గానే కాకుండా పూర్తి పాజిటివ్‌గా వుండే పాత్ర చేయడం విశేషం. తను చేసిన కొన్ని సీన్లు చూసి అక్కడివారంతా క్లాప్స్‌ కొట్టారు. 'నువ్వొస్తానంటే..'లో శ్రీహరిని మరిపించాడని ప్రశంసలు పొందాడు.
 
కథల్ని మీరే ఎంపిక చేస్తారా! నాన్నగారు ఫైనల్‌ చేస్తారా?
కథలు ముందు నేనే వింటాను. విని పరిశీలించాక.. 25 ఏళ్ళ నాన్నగారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతాను. ఆయన కొన్ని సూచనలు చేస్తారు.
 
ప్రతి సినిమానూ చూస్తారా?
వారం వారం విడుదలయ్యే చిత్రాలు చూస్తాను. చూశాక.. వాటిపై చర్చించుకుంటాను.
 
మిమ్మల్నే ఎందుకు ఈ పాత్రకోసం ఎంపిక చేశారనుకుంటున్నారు?
ముందుగా కథ చెబుతానన్నప్పుడు నాన్నగారు దర్శకుడ్ని అడిగిన మొదటి ప్రశ్న. మా అబ్బాయినే ఎందుకు మీరు అడుగుతున్నారు. అతను ఎలా న్యాయం చేస్తారని భావిస్తున్నారు? అని అడిగితే.. కథ ప్రకారం.. అచ్చమైన రాజమండ్రి కుర్రాడిలా మీవాడుంటాడనే సమాధానం చెప్పాడు. పాత్ర కోసం వారం రోజుల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించారు. అందులో పాల్గొన్నా. ఇది కరెక్ట్‌గా నాకు సరిపడే పాత్రే.
 
దర్శకుడు మను పనితీరు ఎలా వుంది?
తను కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెప్పే విధానంలోనూ తీసే తీరులోనూ చక్కటి క్లారిటీ వుందని కమల్‌గారే ఓసారి అన్నారు. మాకు చెప్పినట్లు తీయగలిగారు.
 
రష్‌ చూశాక ఎలా అనిపించింది?
చిత్ర కథను పదిసార్లు వింటాం. చేసేటప్పుడు ప్రతి సీనును జాగ్రత్తగా చేస్తాం. యూనిట్‌ కూడా బాగా చేయాలని తపించి చేస్తారు. చేసిన సీన్లు ఒకటిరెండుసార్లు రష్‌ చూశాక బాగా వుందనిపిస్తుంది. అందుకే.. మాకంటే.. బయటివారు చూసి.. చెబితేనే కరెక్ట్‌ జడ్జిమెంట్‌ వుంటుంది. ఈ సినిమాను 15 మంది కొత్తవారికి చూపించాం. చాలామంది బాగా స్పందించారు. అదే అసలైన రిజల్ట్‌. రేపు ప్రేక్షకుడు కూడా ఇలాగే స్పందిస్తాడని ఆశిస్తున్నాం అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందిరాబేడీ బికినీ శారీ.. మాల్దీవుల్లో భర్త, కుమారుడితో ఎంజాయ్ (ఫోటోలు)