నానితో కలిసి చేస్తుంటే కమల్ గుర్తుకు వస్తారు : 'జంటిల్‌మెన్' ఫేమ్ నివేద ఇంటర్వ్యూ
తెలుగులో నాని పక్కన 'జెంటిల్‌మెన్'లో నటించి సూపర్ పెర్‌ఫార్మర్‌గా ఫస్ట్ సినిమాకే ముద్ర వేసుకున్న మలయాళ నటి నివేద థామస్. ఇకపై తెలుగులో మంచి స్టోరీలుంటే చేస్తానని ప్రకటిస్తోంది. నానితో కలిసి చేస్తుంటే.. కమల్ గుర్తుకు వస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భ
Publish Date: Sat, 18 Jun 2016 (15:57 IST)
Updated Date: Sat, 18 Jun 2016 (16:03 IST)
తెలుగులో నాని పక్కన 'జెంటిల్‌మెన్'లో నటించి సూపర్ పెర్‌ఫార్మర్‌గా ఫస్ట్ సినిమాకే ముద్ర వేసుకున్న మలయాళ నటి నివేద థామస్. ఇకపై తెలుగులో మంచి స్టోరీలుంటే చేస్తానని ప్రకటిస్తోంది. నానితో కలిసి చేస్తుంటే.. కమల్ గుర్తుకు వస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆమెతో ఇంటర్వ్యూ..
రిలీజ్ నాడే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మొదటి కాంప్లిమెంట్ ఎవరిది?
రిలీజ్‌కుముందే దర్శకుడు మెచ్చుకున్నారు. నాకు ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు.
ఈ సినిమాలో ఛాన్స్ ఎలా దక్కింది?
కో-డైరెక్టర్ సురేష్ నేను చేసిన ఓ మలయాళీ మూవీ చూశారట. అలాగే నేను యాక్ట్ చేసిన తమిళ చిత్రం 'పాపనాశం' కూడా చూశారు. కొన్ని ఇంటర్వ్యూలు గమనించారు. అంతా ఓకే అనిపించిన తర్వాత ఈ సినిమాలో నన్ను హీరోయిన్‌గా సజెస్ట్ చేశారు. ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి కూడా నచ్చడంతో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను.
కథ విన్నాక ఎలా అనిపించింది?
దర్శకుడు కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. వినేటప్పుడు ఎలాగైనా ఈ సినిమా చేయాలని నేను అనుకున్నాను. అలాగే కథ చెబుతున్న మోహన్ సార్ కూడా ఈ అమ్మాయి చేస్తే బావుంటుందని అనుకున్నారు. నా యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మోహన్ సార్, నానిగారు ఉంటే చాలు... సినిమా బాగా వచ్చేస్తుందని నమ్మాను. సినిమా చూసినప్పుడు ఆయనేం చెప్పారో దానికంటే బాగా తీశారనిపించింది.
మీ నేపథ్యం?
నేను మలయాళీ అమ్మాయిని కానీ చెన్నైలో ఫ్యామిలీతో సహా సెటిల్ అయ్యాం. ఇప్పుడు అర్కిటెక్ విభాగంలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాను.
నాని నటన ఎలా అనిపించింది?
నాని నా ఫేవరేట్ నటుడు. కమల్ హాసన్‌గారి తర్వాత నానియే నాకు ఇష్టమైన యాక్టర్. నానికి నేను సూపర్ ఫ్యాన్‌ని. తనొక స్పాంటేనియస్ ఉన్న నటుడు, నేచురల్ స్టార్. నాని యాక్ట్ చేసిన సినిమాలన్నీ చూశాను.
డబ్బింగ్ మీరే చెప్పారా?
ఈ సినిమా షూటింగ్‌లోనే నేను తెలుగు నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పాలనుకున్నాను కానీ కొన్ని కారణాలతో వీలుపడలేదు.
గ్లామర్ ఫీల్డులో గ్లామర్ గురించి మీ అభిప్రాయం?
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు, అందువల్ల సినిమాలు హిట్ అవుతాయంటే నేను నమ్మను. కథ వింటాను. నచ్చితే హీరో, డైరెక్టర్ ఎవరని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. కథల ఎంపిక విషయంలో కూడా నాదే తుది నిర్ణయం అవుతుంది. తర్వాత వచ్చే గెలుపు ఓటములకు కూడా నేనే బాధ్యతను తీసుకుంటాను. అయితే ఓటమి నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.
కో-స్టార్ సురభి మధ్య విభేదాలు లేవా?
లేవు. సురభితో బాగా కలిసిపోయాను. మామధ్య ఏ గొడవలు లేవు. సినిమా అయిపోయిన తర్వాత తనను బాగా మిస్ అవుతున్నాను. తను ఢిల్లీలో ఉంటుంది. నేను చెన్నైలో ఉంటాను. అయితే తనతో టచ్‌లోనే ఉంటాను. అలాగే ఇక్కడ నరేష్ తమిళ్‌లో పోరాలి అనే తమిళ్ మూవీలో యాక్ట్ చేసినప్పుడు తనతో మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ కూడా తనతో టచ్‌లోనే ఉంటాను. ఈ సినిమా ముందు కూడా నానికి తను నా గురించి బాగా చెప్పాడట.
కొత్త చిత్రాలు?
ఏ సినిమాలు ఒప్పుకోలేదు. తెలుగులో ఆఫర్లు వస్తున్నాయి.. ఇంకా ఫైనల్ చేయలేదు అని చెప్పారు.