Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిల్ రాజుది లక్కీ హ్యాండ్... హేపీగా ఉంది... హెబ్బా పటేల్‌ ఇంటర్వ్యూ

కుమారి 21 ఎఫ్‌.. చిత్రంతో తెలుగులోకి ప్రవేశించిన గుజరాతీ అమ్మాయి.. హెబ్బా పటేల్. తెలుగు చిత్రాల్లో బిజీగా వుంది. తమిళంలోనూ చేస్తున్నట్లు చెబుతోంది. బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచన ఇప్పట్లో లేదని.. 6 నెలలు బిజీ షెడ్యూల్తో వున్నాయని చెబుతున్న ఈమె.. 'నాన్న నేన

Advertiesment
దిల్ రాజుది లక్కీ హ్యాండ్... హేపీగా ఉంది... హెబ్బా పటేల్‌ ఇంటర్వ్యూ
, శనివారం, 10 డిశెంబరు 2016 (20:39 IST)
కుమారి 21 ఎఫ్‌.. చిత్రంతో తెలుగులోకి ప్రవేశించిన గుజరాతీ అమ్మాయి.. హెబ్బా పటేల్. తెలుగు చిత్రాల్లో బిజీగా వుంది. తమిళంలోనూ చేస్తున్నట్లు చెబుతోంది. బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచన ఇప్పట్లో లేదని.. 6 నెలలు బిజీ షెడ్యూల్తో వున్నాయని చెబుతున్న ఈమె.. 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' చిత్రంలో నటించింది. ఈ నెల 16న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఆమెతో జరిపిన చిట్‌చాట్‌.
 
సినిమాలో ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్సా.. రియల్‌ లైఫ్‌లో?
రియల్‌ లైఫ్‌లో నాకు బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరిగేంత టైం లేదు.
 
మరి సినిమాలో ముగ్గురు ఫ్రెండ్స్‌.. నాన్న.. కథేమిటి?
సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు పద్మావతి. ఈ సినిమాలో నాకు నాన్న పాత్రలో చేసిన రావు రమేష్‌ నన్ను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. సిటీలోకి వచ్చిన పద్మావతి ఓ ఫ్రెండ్‌ దొరుకుతుంది. ఓసారి పద్మావతి చేసే చిన్న తప్పు వల్ల ఆమె, ఆమె చుట్టు ఉన్నవారు ఎలాంటి సమస్యలను ఫేస్‌ చేస్తారనేదే సినిమా. 
 
క్యారెక్టర్‌లో చేసినట్లుగా రియల్‌ లైఫ్‌లో వుంటారా?
ఈ సినిమాలో నేనొక స్టుపిడ్‌ అమ్మాయిలా కనిపిస్తాను అంటే తనెం చేస్తుందో, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియకుండా పనులు చేసేస్తుంటుంది. అలాంటి అమ్మాయి కోసం వాళ్ల నాన్న ఏం చేశాడనేదే కథ. రియల్‌ లైఫ్‌లో అందుకు విరుద్ధంగా వుంటాను. 
 
రియల్‌ లైఫ్‌లో నాన్నగారితో ఎలాంటి రిలేషన్‌?
అందరి నాన్నలాగే మా నాన్న వుంటారు. నిజ జీవితంలో నాన్న అంటే ఇష్టమైనా, కొంత భయం కూడా ఉంది. కానీ సినిమాలో మంచి కథ, తండ్రికూతుళ్ల మధ్య రిలేషన్‌ నచ్చి సినిమాను చేయడానికి ఒప్పుకున్నాను.
 
ఛోటా కె.నాయుడుతో పని చేయడం ఎలా అనిపించింది?
ఒకరకంగా ఆయన వున్నారనే సినిమాను అంగీకరించా. చోటాగారు, వినాయక్‌గారి వద్ద పనిచేశారు. సినిమా గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో సినిమాను బాగా తెరకెక్కించారు. అలాగే చోటాగారితో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రతి సీన్‌ను ఎంతో ఫ్రెష్‌ లుక్‌తో చూపించారు. 
webdunia
 
నిర్మాత ఇన్‌వాల్వ్‌ ఎలా వుంది?
బెక్కం వేణుగోపాల్‌గారు నన్ను కలిసి స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఆయనే దర్శకుడేమో అనుకున్నాను. ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకున్నారు.
 
మరి దిల్‌రాజు విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది?
దిల్‌ రాజుగారు మా సినిమాను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. అంతకుముందు కుమారి 21ఎఫ్‌.. ఆయనే రిలీజ్‌ చేశారు. లక్కీ హ్యాండ్‌.
 
మీరు కథలు ఎవరితో డిస్‌కస్‌ చేస్తారు?
అమ్మకు పెద్దగా తెలీదు. మా ఆంటీతో.. సిస్టర్స్‌తో చర్చిస్తాను.
 
గ్లామర్‌ రోల్స్‌ చేయరా?
ఎందుకు చేయను.. నాకు ఆ రోల్స్‌ రావడంలేదు.
 
కుమారి 21ఎఫ్‌లో లిప్‌కిస్‌లతో చాలా బోల్డ్‌గా నటించారు? ఇలా చేయడం ఇబ్బంది అనిపించలేదా?
మొదటి సినిమా.. కథ బాగుంది. యూత్‌ సబ్జెక్ట్‌.. సీన్‌ పరంగా అలా చేస్తేనే పండుతుందని సుకుమార్‌గారు చెప్పడం... చేయడం జరిగింది.. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.
 
కొత్త చిత్రాలు ఏమైనా చేస్తున్నారా?
ప్రస్తుతం అందగాడు, మిష్టర్‌, ఏంజెల్‌ సినిమాలను చేస్తున్నానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు... కోసం ఐదుగురు హీరోయిన్లు... అవసరాలకు తిరిగింది...