Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబు... కోసం ఐదుగురు హీరోయిన్లు... అవసరాలకు తిరిగింది...

నటుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా మారి చిత్రాలు తీస్తున్నాడు. మరలా హీరోగానూ కొనసాగుతున్నాడు. ఈసారి అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవీన్‌ మేడారం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత

Advertiesment
బాబు... కోసం ఐదుగురు హీరోయిన్లు... అవసరాలకు తిరిగింది...
, శనివారం, 10 డిశెంబరు 2016 (18:54 IST)
నటుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా మారి చిత్రాలు తీస్తున్నాడు. మరలా హీరోగానూ కొనసాగుతున్నాడు. ఈసారి అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవీన్‌ మేడారం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి 'బాబు.. బాగా బిజీ' అనే టైటిల్‌ ఖరారు చేశారు. బాలీవుడ్‌ 'హంటర్‌'కు రీమేక్‌ ఇది. 
 
హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంస్థ తెలుగు చిత్రానికి భాగస్వామిగా వ్యవహరిస్తుంది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
నిర్మాత మాట్లాడుతూ... రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. హంటర్‌ చూసినప్పుడు ఎంతో నవ్వుకున్నాను. తెలుగులో అవసరాల అయితే న్యాయం చేయగలరనిపించింది. ఇటీవల కొన్ని సీన్లు చూసి నా నిర్ణయం సరైందని మరోసాని అనుకున్నా. త్వరలో ఆడియోను విడుదల చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#khaidi no150 teaser Blast... నిన్నటి నుంచి ట్రెండింగ్‌లోనే...(Video)