Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో అతిపెద్ద కరోనా తాత్కాలిక ఆస్పత్రి మూసివేత

Advertiesment
చైనాలో అతిపెద్ద కరోనా తాత్కాలిక ఆస్పత్రి మూసివేత
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:48 IST)
చైనా ప్రభుత్వం కొన్ని రోజుల్లో అతిపెద్ద ఆస్పత్రిని నిర్మించింది. ఈ ఆస్పత్రిని కరోనా రోగుల కోసం చికిత్స చేసేందుకు ఉపయోగించారు. అయితే, ప్రస్తుతం కరోనా రోగుల సంఖ్య తగ్గిపోవడంతో ఈ ఆస్పత్రిని మూసివేశారు. ఈ మేరకు చైనా సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. 
 
వుహాన్‌లో గత యేడాది డిసెంబరు నెలలో కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసింది. ఆ తర్వాత చూస్తుండగానే నగరాన్ని కబళించింది. దీంతో ఫిబ్రవరిలో చైనా ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల సామర్థ్యంలో రెండు అతిపెద్ద ఆస్పత్రులను నిర్మించింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని తీసుకొచ్చి కొవిడ్-19 రోగులకు చికిత్స అందించింది. 
 
ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో లైషెన్షన్ (లోతైన పర్వతం) పేరుతో నిర్మించిన ఓ తాత్కాలిక ఆస్పత్రిని మూసివేసినట్టు ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లినట్టు తెలిపింది.
 
కాగా ఈ రెండు ఆస్పత్రులతో పాటు క్వారంటైన్ కోసం, కొవిడ్-19 చికిత్స కోసం చైనా తాత్కాలికంగా మరో 14 ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. వీటన్నిటీనీ కూడా ఇటీవల మూసేశారు. కొవిడ్-19 చికిత్స కోసం హుబైకి పంపిన చివరి వైద్య బృందం సైతం వుహాన్ విడిచి వెళ్లినట్టు జిన్హువా పేర్కొంది. 
 
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేసిన చైనా ప్రభుత్వం... జనవరి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్‌డౌన్ అమలు చేసింది. హుబై ప్రావిన్స్‌లో మొత్తం 67,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క వుహాన్‌లోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా చైనాలో ఇప్పటి వరకు 3,342 మంది చనిపోయిన విషయం తెల్సిందే. అయితే, ఈ మరణాల సంఖ్యలో చైనా నిజాలు దాస్తుందనే విమర్శలు వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?