Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెక్సికోలో దారుణం- సెల్ఫీలపై మోజు.. రైలు ఢీకొని యువతి దుర్మరణం

Mexico

సెల్వి

, శుక్రవారం, 7 జూన్ 2024 (10:02 IST)
Mexico
మెక్సికోలో దారుణం జరిగింది. సెల్ఫీలపై మోజుతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. 
 
ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియోను చూసిన జనం షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. సీఎం మమతా బెనర్జీ