Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. విద్యార్థిన నేత హత్య... ఎవరీ షరీఫ్ ఉస్మాన్ హాదీ

Advertiesment
osman hadi

ఠాగూర్

, శుక్రవారం, 19 డిశెంబరు 2025 (15:49 IST)
యాంటీ భారత్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి యువజన నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురయ్యాడు. 32 యేళఅల హదీ రిక్షాలో వస్తుంటగా, దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
గతవారం ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన, సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన హాదీ గురువారం రాత్రి మృతి చెందారు.
 
డిసెంబరు 12వ తేదీన ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఆటోరిక్షాలో ప్రచారం నిర్వహిస్తుండగా, ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూరుకు తరలించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. హాదీ మృతదేహాన్ని ఢాకాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం హంతకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఇద్దరు ప్రధాన నిందితుల ఫొటోలను విడుదల చేసి, వారి ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ టాకా రివార్డు ప్రకటించింది. 
 
మరోవైపు, గతేడాది షేక్ హసీనా 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో హాదీ ముందువరుసలో నిలిచారు. ఆయన ఇంక్విలాబ్ మంచ్ అనే విద్యార్థి సంస్థలో కీలక నాయకుడు. రానున్న ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు తీవ్రమైన భారత వ్యతిరేక వైఖరి ఉందని, 'గ్రేటర్ బంగ్లాదేశ్' పేరుతో భారత భూభాగాలను కలుపుతూ మ్యాపులను ప్రచారం చేశారని కథనాలున్నాయి.
 
హాదీ మృతికి సంతాపంగా శనివారం జాతీయ సంతాప దినం పాటిస్తున్నట్లు తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రకటించారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. హాదీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ హత్య వెనుక భారత ప్రమేయం ఉందని బంగ్లాదేశ్‌లోని కొన్ని వర్గాలు ఆరోపించగా, ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ వివాహంతో గొడవలు: వరుడి సోదరుడి ముక్కు కోసేశారు.. వధువు మేనమామ కాలు విరిగింది