పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుకని వెళ్తే.. కాలు పట్టించిన కానిస్టేబుల్ ఎక్కడ?
అత్యాచారాలకు గురైన మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిని పలు రకాల ప్రశ్నలతో హింసించే వారు కొందరు.. వారినే లైంగికంగా వేధింపులకు గురిచేసే వారు మరికొందరున్నారు. ఇది పోలీస్ స్టేషన్లకు వెళ్ళే మహిళల పరిస్థి
అత్యాచారాలకు గురైన మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిని పలు రకాల ప్రశ్నలతో హింసించే వారు కొందరు.. వారినే లైంగికంగా వేధింపులకు గురిచేసే వారు మరికొందరున్నారు. ఇది పోలీస్ స్టేషన్లకు వెళ్ళే మహిళల పరిస్థితి. అదే పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కంటూ వెళ్ళే పురుషులకు కూడా వేధింపులు వేరే విధంగా ఉంటున్నాయి. ఎలాగంటే? ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తికి కానిస్టేబుల్ షాకిచ్చాడు.
ఫిర్యాదు నమోదు చేయకుండానే ఈరోజు- రేపు రా అంటూ తిప్పించడమే కాకుండా కేసు విషయంలో జాప్యం చేయడానికి తోడు.. తన కాలు పట్టాలని ఆ వ్యక్తిని ఆదేశించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇలా కేసు నమోదు చేసేందుకు వెళ్ళిన వ్యక్తితో పోలీస్ కాలు పట్టమని చెప్పిన ఘటన వీడియోతో పాటు నెట్టింట్లోకి వెళ్ళిపోయింది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పై అధికారులు వెంటనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఇక ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.