Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏయ్.. రావే.. నేను పిలుస్తున్నా... మద్యం మత్తులో లేడీస్ హాస్టల్ వద్ద ఏపీ మంత్రి తనయుడి వీరంగం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పోకిరీల కంటే... మంత్రుల తనయులు ఆగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకునిలాగినట్టు కేసు దా

Advertiesment
AP minister's son
, సోమవారం, 1 ఆగస్టు 2016 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పోకిరీల కంటే... మంత్రుల తనయులు ఆగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకునిలాగినట్టు కేసు దాఖలైంది. ఇపుడు తాజాగా మరో మంత్రి తనయుడు.. పీకల వరకు మద్యం సేవించి లేడీస్ హాస్టల్‌ వద్ద హల్‌చల్ సృష్టించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆ మంత్రిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత కీలకంగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆ మంత్రి సుపుత్రుడు ఫుల్లుగా మద్యం సేవించి ఒళ్లు తెలియనంత మత్తులో ఓ లేడీస్ హాస్టల్ వద్ద నానా రభస చేశాడు. ఆ మత్తులో అతడు ఏకంగా లేడీస్ హాస్టల్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. 
 
అయితే మంత్రి గారి కుమారుడి అరుపులు, కేకలతో అక్కడికి సమీపంలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌కు చెందిన యువకులు అక్కడికి చేరుకుని మంత్రి కుమారడిని అడ్డుకునే యత్నం చేసినట్టు సమాచారం. అయినా వినని మంత్రిగారి పుత్రుడు లేడీస్ హాస్టల్‌లోకి చొరబడేందుకే యత్నించాడట. దీంతో లాభం లేదని భావించిన ఆ యువకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రిగారి పుత్రుడిని చూసి చేసేదేమీ లేక మందలించి ఇంటికి పంపారట. అయితే, ఈ మంత్రి పేరు, ఆయన సుపుత్రుడి పేరును విద్యార్థులు బహిర్గతం చేయలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వదిన నగ్న ఫోటోల్ని ఫేస్‌బుక్‌లో పెట్టిన కేరళ సింగర్.. భార్య కూడా ఈ-మెయిల్ ద్వారా..?