లిక్కర్ కింగా మజాకా.. ఫార్ములా వన్ డ్రైవర్‌తో లండన్‌లో దర్జాగా ఫోజులిస్తూ..
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన పవరేంటో చూపించాడు. భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా.. ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా చాలా రోజులకు ఫోటోకు ఫోజ
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన పవరేంటో చూపించాడు. భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా.. ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా చాలా రోజులకు ఫోటోకు ఫోజిస్తూ కనిపించాడు. బ్రిటన్‌లోని ఫార్ములా వన్ రేస్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఫార్ములావన్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
సెర్జియో పెరెజ్, ఈస్టెబాన్ అనే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్జాగా ఫొటోలకు ఫోజులిచ్చాడు. బ్రిటన్‌లో నిర్వహించే ఫార్ములా వన్ రేస్‌లో మాల్యాకు చెందిన సహారా ఫోర్స్ ఇండియా కూడా పోటీ చేస్తుంది. దీనిని బట్టి విజయ్ మాల్యా అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. దాదాపు రూ.9000కోట్లను ఆయా బ్యాంకుల్లో రుణంగా తీసుకొని ఎగ్గొట్టి బ్రిటన్‌కు మాల్యా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి.