Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)

చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో కొరకడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువ‌కుడు ఐఫోన్ బ్యాట‌రీ క

Advertiesment
ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)
, గురువారం, 25 జనవరి 2018 (12:50 IST)
చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో కొరకడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువ‌కుడు ఐఫోన్ బ్యాట‌రీ కొన‌డానికి స్టోర్‌కి వ‌చ్చాడు. అయితే చైనాలో న‌కిలీ ఐఫోన్ బ్యాట‌రీలు కూడా అమ్ముతుండ‌టంతో వాటి విశ్వ‌స‌నీయ‌త ప‌రీక్షించ‌డానికి ఒక బ్యాట‌రీని నోటితో కొరికాడు. 
 
బ్యాటరీని నోటితో కొరికి నోటి నుంచి బయటికి తీసిన మరుక్షణమే అది పేలిపోయింది. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం కలగలేదు. ఈ వీడియోను 50లక్షల మంది వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో మాస్ ప్లాన్... రూ.98కే అన్‌లిమిటెడ్ కాలింగ్