అంతరిక్షంలో భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు చివరిక్షణంలో గుర్తించారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని సైజును, ఎక్కడ పడుతుందనే లెక్కలు కడుతుండగానే ఆ గ్రహశకలం భూమిని తాకింది.
70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి భూమిపై పడిపోయింది. రష్యా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భూమిని తాకింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గ్రహశకలానికి నిప్పంటుకుంది.