Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీళ్లలో కలిసిన వయాగ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి!

నీళ్లలో కలిసిన వయాగ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి!
, బుధవారం, 18 డిశెంబరు 2019 (05:17 IST)
ఐర్లాండ్ రింగస్కిడ్డీలో జనావాసానికి దూరంగా వున్న ఓ దొడ్డి లోని గొర్రెలు హఠాత్తుగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఒక వారం రోజుల పాటు రేయింబవళ్లు శృంగారంలో రెచ్చిపోయాయి.

ఇది చూసిన కాపరులకు విషయం అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా అదే పనిలో ఎందుకుంటున్నాయా అంటూ అయోమయంలో పడిపోయారు. అయితే ఇందులోని రహస్యాన్ని బయటపెట్టిందో స్థానిక పత్రిక.

ఊరికి సమీపంలోని ఫైజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వల్లనే ఆ గొర్రెలు రెచ్చిపోయాయని కథనం ప్రచురించింది. ఈ కంపెనీలో తయారుచేసిన వయాగ్రా మందు పొరబాటున హార్బర్‌లోని నీళ్లలో కలిసిందని, వాటిని తాగడం వల్లే గొర్రెలు ఇలా ప్రవర్తించాయని పేర్కొంది.

అయితే ఈ వార్తలను ఫైజర్ ప్రతినిధులు ఖండించారు. తాము పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించే ఉత్పత్తులనూ తయారుచేయడం లేదని వారు స్పష్టం చేశారు. ఈ గొర్రెల ఘటనకు, తమ కంపెనీకి అస్సలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో కూడా తమకు తెలియదని అధికారులు చెప్పారు.

దీని గురించి గొర్రెల యజమాని మైఖేల్ మార్ఫీ మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేనట్లుగా గొర్రెలు లైంగిక ఉద్రేకంతో ఊగిపోయాయన్నారు. ఆడ గొర్రెలు సహకరించకపోవడంతో అసహజ లైంగికానికి సైతం పాల్పడ్డాయన్నారు. దాంతో గొర్రెల వద్దకు వెళ్లాలంటేనే భయమేసిందని గుర్తు చేసుకున్నారు.

అయితే ఈ కథనం వెలువడ్డాక ఆ కంపెనీ ఉత్పత్తులు విపరీతంగా పెరగడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా టీడీపీ బాధ్యతల నుంచి సీనియర్లకి విముక్తి?