అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదంలో చిక్కారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కిడ్నీ గుండెలో వుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిడ్నీ గుండెలో వుండటం ఏమిటని నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు.
అసలు శరీరంలో ఎక్కడా మ్యాచ్ కానీ ఓ అంశాన్ని చెప్పారని నెటిజన్లు ట్రంప్‌ను ఏకిపారేస్తున్నారు. వైద్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ పలు ఆరోగ్య విషయాలను వెల్లడించారు.
మనకోసం మన శరీరంలో ఎక్కువ పనిచేసేది కిడ్నీ అని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అందుకే గుండెలో దానికి ఎప్పుడూ స్థానముందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే కొందరు మాత్రం.. కిడ్నీ ప్రాధాన్యతను ట్రంప్ గుండెకు దగ్గరగా పోల్చుతూ వ్యాఖ్యానించాలనుకుని వుంటారని వివరణ ఇస్తున్నారు. అయితే ట్రంప్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెటిజన్లు చంద్రుడు కుజగ్రహంలోని ఒక భాగంలో వున్నాడు.. కిడ్నీ గుండెలో వుందంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.