అమెరికాలో దేశంలో మరోమారు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న సిక్కు గురుద్వారా కాల్పులతో దద్ధరిలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ కాల్పుల ఘటనపై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, మత విద్వేషాల కారణంగానే ఒకరికొకరు తెలిసిన వ్యక్తుల మధ్యే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కాల్పుల వెనుక పాత వివాదాలు ఉన్నాయని చెప్పారు.
ఈ మొత్తం ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉండగా, వీరిలో ఇద్దరు స్నేహితులు. మరొకరు ప్రత్యర్థి. వీరి ముగ్గురూ ఒకరికొకరు బాగా తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గత యేడాది అమెరికాలో జరిగిన పలు తుపాకీ కాల్పుల్లో దాదాపు 40 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మరక్షణ కోసం సమయంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి.