Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ కోసం చైనా గోడను బద్దలుకొట్టేస్తాం : అమెరికా రాయబారి రిచర్డ్

భారత్ - అమెరికా స్నేహ సంబంధాల్లో భాగంగా చైనా గోడను బద్ధలు కొట్టేస్తామని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అణు సరఫరా కూటమి (ఎన్‌ఎస్‌జీ) కూటమిలో సభ్యత్వం కోసం భారత్ ముమ్మరంగా ప్రయత్నిస్త

భారత్ కోసం చైనా గోడను బద్దలుకొట్టేస్తాం : అమెరికా రాయబారి రిచర్డ్
, మంగళవారం, 17 జనవరి 2017 (14:58 IST)
భారత్ - అమెరికా స్నేహ సంబంధాల్లో భాగంగా చైనా గోడను బద్ధలు కొట్టేస్తామని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అణు సరఫరా కూటమి (ఎన్‌ఎస్‌జీ) కూటమిలో సభ్యత్వం కోసం భారత్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను చైనా వమ్ము చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రమాణం చేయనున్నారు. అదేసమయంలో భారత్‌లో అమెరికా రాయబారిగా రిచర్డ్ వర్మ నియమితులయ్యారు.
 
ఈ పరిస్థితుల్లో ఎన్.ఎస్.జి గ్రూపులో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై ఆయన స్పందిస్తూ ఎన్‌ఎస్‌జీ సభ్యుత్వంపై భారత్‌కు అమెరికా బాసటగా నిలుస్తుందని, ఈ విషయంలో చైనా సృష్టిస్తున్న అవాంతరాలను డొనాల్డ్ ట్రంప్ అధిగమించగలరని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యుత్వం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సహా అనేక మంది పెద్దఎత్తున కృషిచేశారని... ముందు ముందు కూడా అమెరికా దీనిపై పనిచేస్తుందని ఆయన గుర్తుచేశారు.
 
అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో చోటు కల్పించడం అనేది ఆయా దేశాలు ఇచ్చిపుచ్చుకునే వీడ్కోలు బహుమతి (ఫేర్‌వెల్ గిఫ్ట్) కాదంటూ సోమవారం చైనా ప్రభుత్వం ఒబామా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. చైనా ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే రిచర్డ్ వర్మ ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12ఏళ్ల బాలికపై ప్రిన్స్‌పాల్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్.. స్కూల్ భవనంపైకి తీసుకెళ్లి?