Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ గెలుస్తానంటున్న ట్రంప్ - బైడెన్ వైపు భారతీయుల మొగ్గు!

Advertiesment
US Elections 2020 Live updates
, ఆదివారం, 18 అక్టోబరు 2020 (15:50 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని, మరో నాలుగేళ్లు తమ దేశానికి అధ్యక్షుడిని తానేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా మిచిగాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడుతూ..  ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీదే విజయమని, గతంలోలాగే రిపబ్లికన్‌ పార్టీనే ప్రజలు గెలిపించాలని కోరారు. భవిష్యత్‌లోనూ ప్రజలు ఇలాగే మద్దతు ఇవ్వాలని చెప్పారు.
 
ఈ ఎన్నికలు తమ దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా తాము పని చేస్తున్నామని అన్నారు. దేశ ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగిందని తెలిపారు. తమ‌ పార్టీకి మరోసారి అధికారమివ్వాలని, అమెరికాకు మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి.
 
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు డెమొక్రాట్స్‌ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజాగా విడుదలైన ఓ సర్వేలో తేలింది. ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. నమోదైన భారతీయ అమెరికన్ ఓటర్లలో 72 శాతం మంది బిడెన్‌కు ఓటు వేయాలని యోచిస్తున్నారని, 22 శాతం మంది రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు, మరో 3శాతం మంది మరో అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఫలితాలు వెల్లడించింది. 
 
ఇందుకు 936 మందిని భారతీయ అమెరికన్ పౌరులను ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే - కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పోలింగ్ సంస్థ యుగోవ్ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 మధ్య సర్వే చేసింది.
 
ఎన్‌వైటీ ప్రకారం.. ఫ్లోరిడా, మిచిగాన్‌, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ఉపాధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌కు అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. 45శాతం మంది ఆమెకు అనుకూలంగా నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 
 
కేవలం10 శాతం మంది ఆమెకు వ్యతిరేకంగా ఉండగా, మరో 40 మంది ఎవరైనా తమకు తేడాలేదని చెప్పినట్లుగా చెప్పింది. భారతీయ అమెరికన్లు ఈ ఎన్నికల్లో అమెరికా-ఇండియా సంబంధాలను తక్కువ ప్రాధాన్యం కలిగిన సమస్యగా చూస్తున్నారని, బదులుగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ వంటి జాతీయంగా ముఖ్యమైన సమస్యలను నొక్కి చెప్పారని సర్వే పేర్కొంది. కాగా, అమెరిక అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 3న జరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురి తప్పని బ్రహ్మోస్... గాల్లోకి లేచింది మొదలు...