Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా రక్షణ మంత్రి

Advertiesment
US Defence Secretary
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (14:16 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ తేరుకోలేని షాకిచ్చారు. ట్రంప్‌తో విభేదాలు తలెత్తడంతో ఆయన మనస్తాపం చెందిన తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. 
 
దేశాధినేతగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ సలహాదారుల సూచనలను అసలు పట్టించుకోకుండా… సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం. 
 
సిరియా నుంచి సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ట్రంప్ - మాటిస్‌ల మధ్య సమావేశం జరిగింది. ఇందులో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం. దీంతో మాటిస్ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ట్రంప్‌ ఒత్తడి కారణంగానే మాటిస్‌ రక్షణ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వార్తల్లో నిజం లేదని అమెరికన్‌ అధికారి స్పష్టం చేశారు. సిరియాపై ట్రంప్‌ నిర్ణయంతో విభేదించినందునే మాటిస్‌ తన పదవి నుంచి తప్పుకున్నారని మరికొందరు చెబుతున్నారు.
 
వాస్త‌వానికి మాటిస్ ఫిబ్ర‌వ‌రిలో రిటైర్ కానున్న‌ట్లు ట్రంప్ ఇటీవ‌ల ఓ ట్వీట్ చేశారు. కూట‌మి దేశాల సైన్యాన్ని ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డంలో మాటిస్ కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న‌ అన్నారు. అయితే మాటిస్ స్థానంలో మ‌రో వ్య‌క్తిని నియ‌మించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. కానీ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యాన్ని తెలపలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించిన అమ్మాయి కోసం పాకిస్తాన్ వెళ్లాడు... సైన్యం చేతికి చిక్కి... ఇపుడలా...