Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

వెన్నుపోటు చైనా.. భారత్‌కు మద్దతు ప్రకటించిన అమెరికా

Advertiesment
Indo-China Border Tensions
, శనివారం, 20 జూన్ 2020 (16:52 IST)
లడాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చర్చల పేరుతో పిలిచి అతి కిరాతకంగా చంపడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. చైనా చర్యను వెన్నుపోటుగా అభివర్ణించింది. పైగా, ఇలాంటి సమయంలో భారత్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. 
 
భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణలపై అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో స్పందించారు. చైనా వెన్నుపోటుకు భారత్ గురైందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వద్ద చైనా దుడుకు వైఖరి కారణంగానే పరిస్థితి దిగజారిందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా తన పొరుగు దేశాల విషయంలో దుడుకు వైఖరి అవలంబిస్తోందని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
'అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌తో సరిహద్దు వివాదం ముదిరేలా చేసింది చైనా ఆర్మీయే. దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ దళాలను మోహరిస్తూ చట్టవ్యతిరేకంగా ఆయా ప్రాంతాలను తన ఆధీనంలో తెచ్చుకుంటోంది. సముద్ర రావాణా మార్గాల్లో అశాంతిని సృష్టిస్తోంది' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో తాము భారత్‌కు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పు లడాఖ్‌లో యుద్ధ వాతావరణం - భారీగా భారత బలగాలు తరలింపు